Bigg Boss Amardeep: బిగ్ బాస్ అమర్ దీప్‌పై పుస్తకం.. నిజమైన విన్నింగ్ అంటే ఇదే కదా..

Bigg Boss Amardeep: బిగ్ బాస్ హౌస్ లో ఎంత నెగిటివ్ అయ్యాడో.. బయట అంతే క్రేజ్ సంపాదించుకున్నాడు  అమర్ దీప్ చౌదరి. తాజాగా ఇతడిపై ఏకంగా పుస్తకమే రాసేశాడు ఓ అభిమాని. నిజమైన ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదే కదా.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 03:49 PM IST
Bigg Boss Amardeep: బిగ్ బాస్ అమర్ దీప్‌పై పుస్తకం.. నిజమైన విన్నింగ్ అంటే ఇదే కదా..

Bigg Boss Telugu Season 7 Runner Amardeep: బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కంటెస్టెంట్ పై పుస్తకం రానుంది. విన్నర్ పై బుక్ రావడం కామన్, అలాంటిది రన్నర్ పై పుస్తకం రావడం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్, రన్నరప్ అమర్ దీప్ చౌదరి. 

సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ 07 తెలుగులో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి రైతు బిడ్డ ప్రశాంత్ ను టార్గెట్ చేయడం, ఫౌల్ గేమ్స్ ఆడటం వల్ల అందరిలోనూ నెగెటివ్ తెచ్చుకున్నాడు. నాగార్జున క్లాస్ పీకడంతో ఆరో వారం నుంచి రియల్ గేమ్ ఆడటం మెుదలుపెట్టాడు. అక్కడి నుంచి తన కామెడీ, గేమ్ తో దూసుకుపోయాడు. శివాజీ ఏమన్నా నవ్వుతూ తీసుకోవడం అతడికి ప్లస్ అయింది. చివరికి వచ్చేసరికి అతడికి ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే డిసెంబరు 17న జరిగిన టైటిల్ పోరులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ పోటీపడగా.. విజేతగా రైతుబిడ్డ నిలిచాడు. అయితే అమర్ ఫ్యాన్స్ కు మాత్రం అతడే విన్నర్. అయితే గ్రాండ్ ఫినాలే రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవతో ప్రశాంత్ ఒక్కసారిగా జీరో అయిపోయాడు. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లాడు. 

అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ న్యూ ఇయర్ పార్టీ ప్రోమోను విడుదల చేశారు. ఈ సెలెబ్రేషన్స్ లో టీవీ సీరియల్స్ నటీనటులతోపాటు హనుమాన్ మూవీ టీమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్, శోభా శెట్టి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో  అమర్ దీప్‌కు ఫ్యాన్ మూమెంట్ దక్కింది. అమర్ దీప్ పై ఓ అభిమాని పుస్తకం రాసి అతడిని సర్ ప్రైజ్ చేశాడు. "అందరికీ మీరు రన్నర్ కావచ్చు. మాకు మాత్రం మీరు ఎప్పటికీ విన్నరే అన్నా.. అమర్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు" అని ఆ అభిమాని అమర్‌కు బుక్ ప్రజెంట్ చేశాడు. దాంతో అమర్ దీప్ ఆనందంలో మునిగితేలాడు. 

Also read: Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఢంకీ డైరెక్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News