Producer TG Vishwa Prasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ఈగల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఇటీవల చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈగల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన అప్ కమింగ్ సినిమాల గురించి చెప్పుకుంటూ వస్తూ.. ఇండస్ట్రీలో అవినీతి గురించి కూడా మాట్లాడారు. దేశంలో అవినీతి ఉందని చెప్పిన టీజీ.. ఇండస్ట్రీలోనూ కరప్షన్ ఉందన్నారు. చిన్నస్థాయిలో జరిగే అవినీతి పెద్దస్థాయిలో ఎలా ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. అయితే టీజీ చేసిన వ్యాఖ్యలతో కొందరు హర్ట్ అయ్యారు. కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచి మాట్లాడారంటూ ప్రచారం చేశారు. దీంతో ఈ విషయంపై టీజీ విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read: Money Vastu Tips: మీరు ధనవంతులు కావాలంటే ఈరోజే ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి..!
ఈగల్ మూవీ ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. తన ప్రొడక్షన్ హౌస్‌లో జరిగిన అవినీతి వల్ల సినిమా క్వాలిటీ ఎలా దెబ్బతింటుందో చెప్పానని ఆయన అన్నారు. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో తాను ఎలాంటి ప్రతిచర్యలు చేపట్టానో మీడియాకు వివరించానని చెప్పారు. అయితే దీనికి భుజాలు తడుముకున్న కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు.. తన వ్యాఖ్యలు వక్రీకరించి తానేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్లు దుష్ప్రచారం చేయడం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు చేస్తున్న అవినీతి వల్ల కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే తన డబ్బు అందడం లేదని తాను చెప్పానని టీజీ అన్నారు. తన కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి తాను మాట్లాడిన మాటలకు.. బయటి వారికి సంబంధమేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. తన సంస్థలో ఎవరికైనా జీతాలు అందకపోతే నేరుగా మాట్లాడి తీసుకుంటారని చెప్పారు. యూనియన్‌కి ఫిర్యాదు వస్తే ఛాంబర్‌లో లేదా కౌన్సిల్‌లో సాల్వ్ చేసుకుంటామన్నారు. తాను ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చానని.. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
తన కంపెనీలో అవినీతికి పాల్పడని వారంతా గర్వంగా పనిచేయవచ్చన్నారు. కరప్షన్ చేసిన వారిపై తాను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చని.. కానీ వారి కుటుంబాల గురించి ఆలోచించి వారిని వదిలేశానని అన్నారు. అని తన సొంత నిర్ణయం అని.. బయటి వారికి సంబంధం లేదన్నారు. తాను తీసిన 30కి పైగా సినిమాల్లో 3 లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉందన్నారు. తాను యూనియన్ వర్కర్స్‌కు వ్యతిరేకం కాదని.. వాళ్ల కష్టాన్ని, తన ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
Also Read: High Paying Jobs in India: దేశంలో అత్యధికంగా జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాల జాబితా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter