Durex Wishes to Alia : ఇదేం వాడకంరా అయ్యా.. అలియా పెళ్ళికి అలా ఇప్పుడు ఇలా

Durex Funny Wishes to Alia:  అలియా భట్ తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించింది.  కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్  ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా అభినందించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 12:15 PM IST
  • తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన అలియా
  • పలువురి నుంచి అభినందనల వెల్లువ
  • డ్యూరెక్స్ ఆసక్తికర విషెస్
Durex Wishes to Alia : ఇదేం వాడకంరా అయ్యా..  అలియా పెళ్ళికి అలా ఇప్పుడు ఇలా

Durex Funny Wishes to Alia: కపూర్ ఫ్యామిలీలోకి త్వరలో కొత్త అతిథి రాబోతున్నాడు. రణబీర్ కపూర్ భార్య అలియా భట్ తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించింది. డాక్టర్‌ని కలవడానికి వెళ్లిన సమయంలో సోనోగ్రఫీ చేస్తుండగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. అలియా బెడ్‌పై పడుకుని అల్ట్రాసౌండ్ మెషీన్ స్క్రీన్ వైపు చూస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు 'మా పాప త్వరలో వస్తోంది' అని క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఆమె ఆ పోస్ట్ షేర్ చేసిన తర్వాత, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనల వెల్లువ కురిసింది. 

కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ కూడా వెనుకంజ వేయకుండా ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా అభినందించింది. 'మెహ్‌ఫిల్ మే తేరీ, హమ్ తో క్లియర్‌గా నహీ థైన్' అని కంపెనీ తమాషాగా ట్వీట్ చేసింది. డ్యూరెక్స్ ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో ఈ మేరకు పోస్ట్‌లు షేర్ చేశారు. ఇంతకు ముందు, ఏప్రిల్ 14న రణబీర్-ఆలియా వివాహం చేసుకున్నప్పుడు కూడా డ్యూరెక్స్ ఒక ఫన్నీ పోస్ట్ ద్వారా ఈ జంటను విభిన్నంగా అభినందించింది.

అప్పుడు డ్యూరెక్స్, 'డియర్ రణబీర్ మరియు అలియా...మెహఫిల్ మే తేరే, హమ్ నా రహే జో, ఫన్ తో నహీ హై' అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అప్పట్లో వైరల్‌గా కూడా మారింది. డ్యూరెక్స్ దీన్ని పోస్ట్ చేసిన వెంటనే, దీని తర్వాత నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్స్ వెల్లువెత్తాయి. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తూ కండోమ్ కంపెనీ వాడకాన్ని ప్రశంసించారు. రణబీర్ - అలియా ముంబైలో చాలా సింపుల్ స్టైల్‌లో వివాహం చేసుకున్నారు. 
Also Read: Naga Chaitanya First Love: సమంత కంటే ముందే లవ్ స్టోరీ.. అలా బయట పెట్టిన నాగచైతన్య

Also Read: Samantha New Item Song: సమంత మరో క్రేజీ ఐటం సాంగ్.. ఇక రచ్చ రచ్చే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News