Hey Sinamika Trailer: సూపర్ స్టార్ చేతుల మీదుగా.. దుల్కర్ 'హే సినామిక' ట్రైలర్ రిలీజ్..

Hey Sinamika: హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న 'హే సినామిక' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 08:34 PM IST
Hey Sinamika Trailer: సూపర్ స్టార్ చేతుల మీదుగా.. దుల్కర్ 'హే సినామిక' ట్రైలర్ రిలీజ్..

Hey Sinamika Telugu Trailer: హీరో దుల్కర్‌ సల్మాన్‌ తాజా చిత్రం '‘హే సినామిక'’(Hey Sinamika). ఈ సినిమా ద్వారా ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మార్చి 3న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మలయాళ ట్రైలర్ ను మమ్ముట్టి విడుదల చేశారు. 'ఈ ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు' అంటూ మహేష్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేశారు. 

ప్రేమ, పెళ్లి, విడాకులు...అనే మూడు అంశాలు చుట్టూ కథ మెుత్తం తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ, కలిసి జీవించటానికి ఉన్న ఒకే ఒక్క కారణం ప్రేమ'’ అంటూ దుల్కర్ (Dulquer Salmaan) చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి  '96' ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి 'యూ' సర్టిఫికేట్ లభించింది. 

Also Read: Tollywood Films: వేసవిలో వినోదపు తుఫాన్.. టాలీవుడ్‌లో వరుసగా విడుదల అవుతున్న పెద్ద సినిమాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News