Kamal Haasan : కమల్ హాసన్ సినిమా నుంచి బయటకువచ్చేసిన ఇద్దరు స్టార్ హీరోలు.. కారణం అదే!

Thug Life : కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ సినిమా నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తప్పు కోవడం ఇప్పుడు అభిమానులకి పెద్ద షాక్ గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2024, 02:55 PM IST
Kamal Haasan : కమల్ హాసన్ సినిమా నుంచి బయటకువచ్చేసిన ఇద్దరు స్టార్ హీరోలు.. కారణం అదే!

Dulquar Salman and Jayam Ravi: విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. థగ్ లైఫ్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో చాలామంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో పాటు ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ కోసం డేట్లు కుదరకపోవడంతో ఈ ఇద్దరు హీరోలు కమల్ హాసన్ సినిమా నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

1987లో కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నాయకన్ (తెలుగులో నాయకుడు) అనే సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరు థగ్ లైఫ్ అనే సినిమాతో ఒక ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ కూడా వీరిద్దరికి ఒక స్క్రిప్ట్ నచ్చి ఓకే చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో కమల్ హాసన్ పాత్ర, కథ గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. 

త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అభిరామి, నాజర్, గౌతమ్ కార్తీక్ తో పాటు ఐశ్వర్య లక్ష్మి కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News