Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు కోర్టు..

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 13, 2024, 12:05 PM IST
  • నటి హేమకు భారీ ఊరట..
  • ఆ కండీషన్స్ పెట్టిన కోర్టు..
Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు కోర్టు..

Bengaluru court granted bail to actress hema: ఇరు తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ ఘటన పెనుసంచలనంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు బెంగళూరు పోలీసులు 103 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా, అందులో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో 86 మందికి బెంగళూరు పోలీసులు తమ ముందు హజరు కావాలని నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉండగా... అనేక నాటకీయ పరిణామల తర్వాత నటి హేమను బెంగళూరు పోలీసులు ఆమె ఇంట్లో మూడోసారి నోటీసులు ఇచ్చి, ఆస్పత్రిలో టెస్టులు చేసిన అనంతరం బెంగళూరు కోర్టులో హజరుపర్చారు. కోర్టు ఆమెకు 14 రోజుల పాటు పోలీసుల కస్డడీకీ అనుమంతించింది. ఆ తర్వాత తిరిగి పోలీసులు కోర్టులో హజరు పర్చారు.

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ఇదిలా ఉండగా.. నటి హేమకు తాజాగా బెంగళూరు కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.  డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న నటి హేమకు కండీషనల్ బెయిల్ ను జారీ చేసింది.  ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా బెంగళూరులోని..  పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం (జూన్ 12) బెయిల్ మంజూరైంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, ఘటన జరిగిన పది రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు.  

అయితే.. ఇరువురి తరపు లాయర్ల వాదనలను విన్న న్యాయమూర్తి నటిహేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. మరోవైపు నటి హేమ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన వెలుగులోకి వచ్చాక అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నారు. హేమ ఒకసారి తాను ఫామ్ హౌస్ లో లేనని ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని, తన ఇంట్లో బిర్యానీ చేస్తున్న వీడియోలు రిలీజ్ చేస్తు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురయ్యారు. బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోలను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఒకసారి తనకు ఆరోగ్యం బాగాలేదని, మరోసారి పోలీసులు నోటీసులకు స్పందించలేదు. దీంతో సీసీబీ పోలీసులు ఆమె నివాసానికి వెళ్లి, నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం ఆమెకు షాక్ ఇచ్చింది. నటి హేమ ప్రాథమిక సభ్యత్వంను రద్దు చేస్తు ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, నటి హేమకు బెయిల్ రావడంతో ఆమెకు ఒకింత ఊరట లభించిందని మాత్రం చెప్పుకోవచ్చు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News