DJ Tillu OTT: ఓటీటీలో 'డిజే టిల్లు' విడుదల తేదీ వచ్చేసిందోచ్చ్​..!

DJ Tillu OTT: థియేటల్లలో విడుదలై లాభాల మోత మోగించిన డీజే టిల్లు ఇప్పుడు డిజిటల్​ ప్లాట్​ఫామ్​లో సందడికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది ఆహా ఓటీటీ.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 06:07 PM IST
  • ఇక డిజిటల్ ప్లాట్​ఫామ్​పై డీజే టిల్లు సందడి
  • విడుదల తేదీపై ఆహా అధికారిక ప్రకటన
  • ఈ నెలలోనే థియేటర్లలో విడుదలైన సినిమా!
DJ Tillu OTT: ఓటీటీలో 'డిజే టిల్లు' విడుదల తేదీ వచ్చేసిందోచ్చ్​..!

DJ Tillu OTT: చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయం సాధించిన మూవీ 'డీజే టిల్లు'. అట్లుందటి మనతోని సినిమా క్యాప్షన్​. ఈ నెల 20న థియేటర్లలో విడుదలై ఘన విజయం మంచి విజయం సాధించింది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన గత రెండు సినిమాలు నేరుగా.. ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. దీనితో ఈ సారి ఎలాగైనా థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లుగానే థియేటర్లలో విడుదల చేసి హిట్​ టాక్ సాధించారు.

ఇప్పుడు ఈ సినిమా.. ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆహా ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా వెళ్లడికాగా.. నేడు ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. మార్చి 4న ఈ సినిమా స్ట్రీమింగ్​కు అందుబాటులోకి తేనున్నట్లు ఆహా ఓటీటీ ట్విట్టర్​ ద్వారా వివరించింది.

డీజే టిల్లు గురించి..

డీజి టిల్లు సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించగా.. నేహా శెట్టి హీరోయిన్​. ఈ సినిమాకు విమల్​ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు డైలాగ్స్ కూడా సిద్ధూనే అందించడం విశేషం. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సితారా ఎంటర్​టైన్మెంట్స్​, పార్చూన్స్​ ఫోర్​ సినిమాస్​ బ్యానర్లపై.. సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాను నిర్మించారు.

ఇక మూవీలో బ్రహ్మాజీ, ప్రిన్స్​ సహా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

రూ. కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా.. తొలి 9 రోజుల్లో రూ.27 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఇది కాకుండా ఓటీటీ హక్కుల ద్వారా కూడా ఈ మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

Also read: Akhil Marriage Matches: అఖిల్ పెళ్లి ప్రయత్నాలు, మంచి సంబంధం కోసం చూస్తున్న అక్కినేని కుటుంబం

Also read: Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News