Dirty Fellow: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'డర్టీ ఫెలో' మూవీ.. రిలీజ్‌కు సిద్ధం

Dirty Fellow Release Date: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన డర్టీ ఫెలో మూవీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వివరాల ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2023, 02:50 PM IST
Dirty Fellow: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'డర్టీ ఫెలో' మూవీ.. రిలీజ్‌కు సిద్ధం

Dirty Fellow Release Date: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి  హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డర్టీ ఫెలో. మూర్తిసాయి అడారి దర్శకత్వం వహించగా.. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జీ శాంతి బాబు నిర్మించారు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో శాంతి చంద్ర మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే వారంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెడుతున్నామని.. ప్రముఖ హీరో చేతులమీదుగా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్‌లో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. 

డైరెక్టర్ మూర్తి సాయి తమకు కథ ఎలా చెప్పారో.. అదే స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారని తెలిపారు. స్క్రీన్‌పై చూసినప్పుడు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కుదిరిందని అన్నారు. అంచనాలకు మించి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. నాసిక్, అరకు, వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ మంచి సాంగ్స్ ఇచ్చారని.. పాటలు అన్ని మరో లెవెల్‌లో ఉంటాయన్నారు. 

"తండ్రీకొడుకుల మధ్య సాగే కథ.. ఒక తండ్రి తన కొడుకును సరైన మార్గంలో నడిపించకపోతే.. ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారతాడు. ఈ నేపథ్యంలో ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏటి..? ఇద్దరి మధ్య జరిగే యాక్షన్ డ్రామా ఇది. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా నటించారు.." అని హీరో శాంతి చంద్ర తెలిపారు. 

డైరెక్టర్ మోహన్ సాయి అడారి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు తమ సినిమాలో ఉంటాయన్నారు. హీరో శాంతి చంద్ర డాక్టర్ సతీష్ సహకారం మరువలేనని చెప్పారు. తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎడిటర్‌గా జేపీ పనిచేయగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ఎస్.రామకృష్ణ నిర్వర్తించారు. 

Also Read: IRCTC Package: ఐఆర్సీటీసీ నుంచి కొత్త ప్యాకేజ్, 14 వేలకే ఆధ్యాత్మిక ప్రదేశాాల పర్యటన

Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News