Andrea Jeremiah Nude Scene: సినిమాలో నగ్నంగా ఆండ్రియా.. అందుకే అన్ని కోట్లన్న డైరెక్టర్ మిస్కిన్

Director Mishkin Reveals Andrea Jeremiah Nude Scene Details in pisasu 2 movie: పిశాచి 2 సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్ గురించి డైరెక్టర్ మిస్కిన్ స్పందించారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 04:11 PM IST
Andrea Jeremiah Nude Scene: సినిమాలో నగ్నంగా ఆండ్రియా.. అందుకే అన్ని కోట్లన్న డైరెక్టర్ మిస్కిన్

Director Mishkin Reveals Andrea Jeremiah Nude Scene Details in pisasu 2 movie: తమిళ భామ ఆండ్రియా జర్మియా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  తమిళ సినీ పరిశ్రమలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత నటిగా కూడా మరి అనేక అవకాశాలు దక్కించుకుంది. గత ఏడాది విడుదలైన పుష్ప సినిమా తమిళ వర్షన్ ఊ అంటావా మామా సాంగ్ పాడి మరింత క్రేజ్ సంపాదించిన ఈ భామ గతంలో ఫహాద్ ఫాజిల్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం నడిపి మంచి ఫేమస్ అయ్యింది.

ఆమె ప్రస్తుతం పిశాచి 2 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 2014లో వచ్చిన పిశాచి అనే సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు తమిళ పాపులర్ డైరెక్టర్ మిస్కిన్. ఇక ఈ సినిమాలో ఆండ్రియా కొన్ని సన్నివేశాల్లో పూర్తి నగ్నంగా నటించిందని పలు వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ వార్తలు పై ఇప్పటివరకు సినీ మేకర్స్ నుంచి గాని ఆండ్రియా నుంచి కానీ ఎలాంటి క్లారిటీ అయితే లభించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ వార్తలపై దర్శకుడు మిస్కిన్ స్పందించారు.

తమ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించిన విషయాన్ని ధృవీకరించిన ఆయన అలా కనిపించడం కోసం కొన్ని కోట్లు అదనంగా డిమాండ్ చేసి మరీ ఆమె తీసుకుందని వెల్లడించారు. ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా కనిపిస్తుంది కానీ అవి కేవలం ఫోటోలు మాత్రమే అని అన్నారు. వీడియోలు లాంటివి మేము షూట్ చేయలేదు కానీ ఆ ఫోటోలను మ్యాజిక్ చేసి ఈ వీడియోలాగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకున్నామని చెప్పుకొచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ఫోటోలు తీసినప్పుడు తాను అసలు సెట్లో లేనని, అసలు సెట్లో ఆండ్రియా సహా ఒక లేడీ ఫోటోగ్రాఫర్ తప్ప ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. ఈ న్యూడ్ ఫోటో షూట్ చేస్తున్న నేపథ్యంలో ఆండ్రియా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మరీ తీసుకుందని, అయితే తన శరీరాన్ని నగ్నంగా చూపించిన సమయంలో అలా ఎక్కువ డిమాండ్ చేయడంలో కూడా తప్పు లేదని తనకు అనిపించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అంతా కష్టపడి షూట్ చేసిన తర్వాత సినిమాలో పెట్టడం సబబు కాదు అనిపించిందని ఎందుకంటే సినిమా అంటే చిన్నపిల్లలతో సహా అందరూ  వస్తారు కాబట్టి వాళ్లు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమాలో ఆ ఫోటోలను యాడ్ చేయలేదని చెప్పుకొచ్చారు.

సెన్సార్ వాళ్ళు ఎలాగో అభ్యంతరం చెబుతారనే ఉద్దేశంతో ముందే ఆ ఫోటోలు పెట్టలేదని అన్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 31వ తేదీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కానీ పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే ఆగస్టు 31వ తేదీన విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా మూవీ  కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Also Read: Hero Vidyasagar Died: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో హీరో మృతి

Also Read: Liger 3 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వసూళ్లు.. హిందీలో రౌడీ జోరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News