Kalyan Krishna: లంబసింగి నిర్మించడానికి కారణం అదే.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Lambasingi: దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఇప్పుడు లంబసింగి సినిమాతో నిర్మాతగా మారారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2024, 04:54 PM IST
Kalyan Krishna: లంబసింగి నిర్మించడానికి కారణం అదే.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Lambasingi Success Meet: భారత్ రాజ్ హీరోగా బిగ్ బాస్ బ్యూటీ దివి హీరోయిన్ గా నటించిన చిత్రం లంబసింగి.‌కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15 విడుదల అయ్యి ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. నవీన్ గాంధీ దర్శకత్వం ఈ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు...

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ముందుగా మీడియా వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.’ మా సినిమాకి అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే... టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పెద్దవాడినే కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలోకి వచ్చాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి దాదాపు ఏడు సంవత్సరాలకు పైగా వెయిట్ చేశారు, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ నాకు అవకాశం ఇచ్చారు. అందుకే నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి దివి ఈ సినిమాలో చాలా చక్కగా నటించింది, భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అననికి మంచి భవిషత్తు ఉండాలి. నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్.ఆర్.ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు. ఈ సినిమాని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్న’ అని చెప్పుకొచ్చారు.

అనంతరం ఈ సినిమా హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ  దివి మాట్లాడుతూ…’ దర్శకుడు మా చిత్రం నిర్మాత కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు,’ అని చెప్పుకొచ్చింది.

Also read: Lok Sabha Elections 2024: దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు..

Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News