Animal: రణబీర్ కపూర్‌పై దిల్ రాజు భారీ ఆశలు.. ఏకంగా అన్ని కోట్ల రూపాయలు

Ranbir Kapoor: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు రణబీర్ కపూర్ పై పెట్టుకున్న నమ్మకం గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2023, 10:53 AM IST
Animal: రణబీర్ కపూర్‌పై దిల్ రాజు భారీ ఆశలు.. ఏకంగా అన్ని కోట్ల రూపాయలు

Dil Raju: అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన మొదటి సినిమాతోనే బోల్డ్ కంటెంట్ చిత్రం తీసి టాలీవుడ్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు.‌ ఒకరకంగా చెప్పాలి అంటే అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకు లిప్ కిస్ సీన్లు అంటే భయపడిన దర్శకులు కూడా ఆ సినిమా తరువాత నుంచి వారి సినిమాలలో విచ్చలవిడిగా పెట్టేయడం మొదలుపెట్టారు. ఇక అంతటి ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి తన తదుపరి సినిమా ఎవరితో తీస్తారు అని అందరూ అనుకుంటూ ఉండగా.. అందరికీ షాక్ ఇచ్చి తన రెండవ సినిమా తెలుగులో కాకుండా ఏకంగా హిందీలో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా అర్జున్ రెడ్డికి రీమేకా వచ్చిన కబీర్ సింగ్ కావటం విశేషం…

ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలకి సిద్ధంగా ఉండగా ఈ సినిమా ట్రైలర్ మొన్ననే విడుదలై.. మరోసారి సందీప్ మార్క్ చూపించింది. ఇక ఈ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు కూడా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ ముందు వరకు ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల చిత్రం అని తెలిసి భయపడిన ప్రేక్షకులు ట్రైలర్ విడుదల తరువాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అంతేకాదు హైదరాబాదులో ఇప్పటికే విడుదలైన టికెట్ల బుకింగ్ జోరుగా సాగుతోంది.

సూపర్ కాకా అసలు విషయం ఏమిటి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు మొత్తం 15 కోట్లకు ఒప్పందం చేసుకున్నారట. హిందీ హీరో అది కూడా రన్బీర్ కపూర్ సినిమాకి ఇన్ని కోట్ల ఒప్పందం అంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. కానీ సందీప్ రెడ్డి పైన ఉన్న నమ్మకమో లేదా కథ పైన ఉన్న నమ్మకమో.. తెలియదు కానీ మొత్తం మీద ఈ రణబీర్ కపూర్ సినిమా పైన దిల్ రాజు ఎక్కువ ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అన్ని క్యాలికులేషన్లు సరిచూసుకుని దిల్ రాజు ఆ మొత్తానికి ఎస్ చెప్పారట. డిసెంబర్ 1 ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ముందురు రోజు రాత్రి ప్రీమియర్లతో మొదలుపెట్టి భారీ ఎత్తున్న ప్లానింగ్ జరుగుతోందట.

అంతేకాదు యానిమల్ సినిమా తరువాత రణబీర్ కపూర్ తో రెండు సినిమాలు తాను ప్రొడ్యూసర్ గా తీయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారట దిల్ రాజు. ఆ సినిమా కూడా చాలా హై బడ్జెట్ తో ఈ ప్రొడ్యూసర్ తెరకెక్కించాలని అనుకుంటున్నారని సమాచారం. మొత్తం పైన దిల్ రాజు రణబీర్ పై బోలెడు ఆశలు పెట్టుకోఉన్నాడు. ఇవి నెరవేరుతాయా లేదా తెలియాలి అంతే యానిమల్ రిలీజ్ తేదీ అనగా డిసెంబర్ ఒకటి వరకు వేచి చూడాలి.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News