Dhanush's Rs 150 Cr House: రూ. 150 కోట్ల ఇంట్లోకి ధనుష్.. ఎక్కడో తెలుసా ?

Dhanush buys Rs 150 Cr House: ఇటీవలే ఈ ఇంట్లో గృహ ప్రవేశం చేసిన ధనుష్.. తనకు అత్యంత ఆప్తులను ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి వెళ్లిన ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్, డైరెక్టర్ కూడా అయిన సుబ్రహ్మణ్యం శివ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధనుష్ అభిమానులతో పంచుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 07:16 PM IST
Dhanush's Rs 150 Cr House: రూ. 150 కోట్ల ఇంట్లోకి ధనుష్.. ఎక్కడో తెలుసా ?

Dhanush buys Rs 150 Cr House: ధనుష్ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. అది కూడా మాములు ఏరియాలో కాదు.. మాములు ఇల్లు కాదు. ధనుష్ కొనుగోలు చేసిన కొత్త ఇంటి ఖరీదు అక్షరాల రూ. 150 కోట్లు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎనలేని సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ధనుష్ సినీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు ఇంచుమించు 50 సినిమాల్లో నటించాడు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అల్లుడు కావడానికంటే ముందే హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇంత కాలం వెనకేసిన సొమ్ముతో మాంచి కాస్ట్‌లీ మాన్షన్ సొంతం చేసుకున్నాడు. 

కోలీవుడ్ సెలబ్రిటీలకు పోయేస్ గార్డెన్స్‌లో ఇల్లు సొంతం చేసుకోవడం ఓ కల. అలనాటి తార, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నుంచి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు.. ఇండస్ట్రీలో పేరున్న బడా బడా సెలబ్రిటీల్లో అతి కొద్ది మందికే అక్కడ నివాసం ఉందని చెబుతుంటారు. అలాంటి కాస్ట్‌లీ ఏరియాలో.. అది కూడా తళైవా రజినీకాంత్ నివాసం పక్కనే ధనుష్ ఖరీదైన మాన్షన్ సొంతం చేసుకున్నాడు. ప్యాలెస్ లాంటి ఈ ఇంటిని కైవసం చేసుకోవడం కోసం ధనుష్ రూ. 150 కోట్లు వెచ్చించాడు.  

ఇటీవలే ఈ ఇంట్లో గృహ ప్రవేశం చేసిన ధనుష్.. తనకు అత్యంత ఆప్తులను ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి వెళ్లిన ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్, డైరెక్టర్ కూడా అయిన సుబ్రహ్మణ్యం శివ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధనుష్ అభిమానులతో పంచుకున్నాడు. ధనుష్ బ్లూకలర్ కుర్తా, వైట్ కలర్ పైజామాలో కనిపించగా.. ధనుష్ తల్లిదండ్రులు ట్రెడిషనల్‌వేర్ ధరించి ఉండటం ఆ ఫోటోల్లో చూడొచ్చు. ధనుష్ తన తల్లిదండ్రులకు బహుమతిగా ఈ ఇంటికి కొనిచ్చినట్టు తెలుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Subramaniam Shiva (@directorsubramaniamshiva)

 

ధనుష్ ఖరీదైన మాన్షన్ కొనుగోలు చేశాడని తెలియడంతో ధనుష్ అభిమానులు, నెటిజెన్స్ అతడి రెమ్యునరేషన్ ఎంత అనే కోణంలో గూగుల్ చేయడం ప్రారంభించారు. ధనుష్ ఒక సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తాడని కోలీవుడ్ వర్గాలను ఎంక్వైరీ చేయగా.. సినిమా కథ నచ్చి, ఒకవేళ లో బడ్జెట్ అయినట్టయితే ధనుష్ ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని.. అలా కాకుండా ల్యావిష్ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమా అయితే.. రూ. 12 కోట్లు నుంచి రూ. 115 కోట్లు వరకు చార్జ్ చేస్తాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : Shivathmika Photos: శివాలెత్తిస్తున్న శివాత్మిక ఎద అందాలు

ఇది కూడా చదవండి : Shah Rukh Khan FIR : షారుఖ్ ఖాన్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న నెటిజన్.. వద్దని వేడుకున్న బాలీవుడ్ బాద్ షా

ఇది కూడా చదవండి : Tollywood Record: ఈ తరంలో ఆ రికార్డు రామ్ చరణ్ తరువాత మంచు విష్ణుదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News