Devara Movie Update: భారీ సొర చేపతో తలపడనున్న ఎన్టీఆర్.. ఛత్రపతిని మించి..!

Jr.NTR latest Movie: జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 04:15 PM IST
Devara Movie Update: భారీ సొర చేపతో తలపడనున్న ఎన్టీఆర్.. ఛత్రపతిని మించి..!

Devara Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'(Devara Movie). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్స్ట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 05న తీసుకురాబోతున్నట్లు ఇది వరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత కొరటాల టేకాఫ్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీపై భారీ హైప్ నెలకొంది. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో కొరటాల ఓ భారీ యాక్షన్‌ సీన్‌ను డిజైన్‌ చేశాడట. ఈ క్రమంలో సముద్రంలో ఓ భారీ షార్క్‌తో తారక్‌ ఫైట్‌ చేయబోతున్నట్లు ఫ్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఇప్పటికే ఈ సీక్వెన్స్ కు సంబంధించిన పనులు కూడా ఆరంభించారట మేకర్స్. ఛత్రపతి మూవీలో ప్రభాస్ సొరచేపతో చేసిన ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ రేంజ్ లో చిత్రీకరించారు జక్కన్న రాజమౌళి. దేవరలో కూడా అంతకు మించిన ఫీల్ ను అందించబోతున్నారట కొరటాల టీమ్. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. 

Also Read: Kushi Movie Trailer: రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఖుషి' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News