Deepthi Sunaina : వెంటనే చెప్పేయండి లేదంటే నా పరిస్థితే మీకూ వస్తుంది!.. ప్రేమ విషయంలో దీప్తి సునయన సలహాలు

Deepthi Sunaina Love Suggestion దీప్తి సునయన సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీప్తి సునయన చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి దీప్తి సునయన ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 08:14 PM IST
  • అభిమానులతో దీప్తి సునయన చిట్ చాట్
  • ప్రేమ వ్యవహారంలో బిగ్ బాస్ బ్యూటీ సలహాలు
  • ఆలస్యం చేయకూడదన్న దీప్తి సునయన
Deepthi Sunaina : వెంటనే చెప్పేయండి లేదంటే నా పరిస్థితే మీకూ వస్తుంది!.. ప్రేమ విషయంలో దీప్తి సునయన సలహాలు

Deepthi Sunaina Love Suggestion బిగ్ బాస్ షోతో దీప్తి సునయన చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. దీప్తి సునయన బిగ్ బాస్ షోతో విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకుంది. తెలిసీ తెలియని వయసులో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లింది. టీన్ ఏజ్‌లోనే దీప్తి సునయన బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆమె తన చేష్టలు, మాటలతో జనాల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంది. అయితే ఆ తరువాత మెల్లిమెల్లిగా కాస్త పాజిటివ్ ఇమేజ్‌ను తెచ్చుకుంది.

కాస్త మెచ్యూరిటీ పెరగడం, తాను తెలియక చేసిన తప్పులను క్షమించండి అని నెట్టింట్లో వేడుకోవడంతో జనాలు కాస్త కూల్ అయ్యారు. దీప్తి సునయను అర్థం చేసుకున్నారు. దీప్తి షన్ను లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో ఈ షన్ను గురించి దీప్తి సునయన పదే పదే చెబుతూ ఉండేది. బయట షన్నుని పెట్టుకుని లోపల తనీష్‌తో కాస్త క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో మరింత నెగిటివ్ అయిందన్న సంగతి తెలిసిందే.

Also Read:  Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా

ఇక షన్ను బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు సిరితో చేసిన రొమాన్స్, నడిపిన ట్రాక్ చూసి దీప్తి సునయనకు మండిపోయినట్టుంది. అందుకే షన్ను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. ఇద్దరి ప్రపంచాలు వేర్వేరు అయ్యాయి. అయితే బిగ్ బాస్ వల్ల దీప్తి, షన్నులు విడిపోయినట్టు అయింది.

తాజాగా దీప్తి సునయన తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్ ఇలా సలహా అడిగాడు. వన్ సైడ్ లవ్ అని, ఐ లవ్యూ అని చెప్పే ధైర్యం చాలడం లేదు ఏం చేయాలి? అని అడిగాడు. దీనికి దీప్తి సునయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. సుస్సు వస్తే వెంటనే పోసుకోవాలి.. ఆకలి వేస్తే వెంటనే తినేయాలి.. ఇలా ప్రేమ ఉన్నప్పుడు వెంటనే చెప్పేయాలి.. లేదంటే నాలాంటి పరిస్థితే మీకు వస్తుంది అని చెప్పేసింది.

Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News