Deepika Padukone: బాగా హర్ట్ అయిందిగా.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా పదుకొనె!!

Deepika Padukone shows middle finger to media. పఠాన్ సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అవ్వడంపై దీపికా పదుకొనె ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక ఇటీవలే షూటింగ్ స్పాట్‌కి వచ్చిన మీడియాపై పొడుగుకాళ్ల సుందరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 02:01 PM IST
  • బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్‌
  • దీపికా.. బాగా హర్ట్ అయిందిగా
  • మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా
Deepika Padukone: బాగా హర్ట్ అయిందిగా.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా పదుకొనె!!

Deepika Padukone shows middle finger to media over Leaked pics from Pathaan: బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో దీపికా పదుకొనె ఒకరు. 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. లవ్ ఆజ్ కల్, కాక్టెయిల్, యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, రామ్ లీలా, పీకు, చపాక్ లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దీపికా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు.
 

పఠాన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనెలపై కీలక సన్నివేశాలు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఆన్ సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ముందుగా షారుక్ ఫొటోలు బయటికి రాగా.. ఆపై దీపికా హాట్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. లీకైన కొన్ని ఫొటోలలో దీపికా ఎల్లో బికినీని ధరించి బోల్డ్‌గా కనిపించారు. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్న చిత్రాలు అవి. మరికొన్నింటిలో బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్‌లో స్కర్ట్‌ ధరించి హాట్ లుక్‌లో కనిపించారు.

స్పెయిన్‌లో బహిర్గత ప్రదేశంలోనే పఠాన్ షూటింగ్ చేయడం, పెద్దగా సెక్యురిటీ కూడా లేకపోవడంతో మీడియా, అభిమానులు కెమెరాలకు పనిచెప్పారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనెలను తమ కెమెరా, మొబైల్ ఫోన్‌లోబందించి  నెట్‌లో పెట్టారు. అవి కాస్తా వైరల్ అయి విషయం షారుఖ్, దీపికాలకు తెలిసిపోయింది. ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అవ్వడంపై దీపికా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక ఇటీవలే షూటింగ్ స్పాట్‌కి వచ్చిన మీడియాపై పొడుగుకాళ్ల సుందరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడిల్ ఫింగర్‌ని మీడియాకు చూపించి.. తన కోపాన్ని వెళ్లగక్కారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

దీపికా పదుకొనె తన మిడిల్ ఫింగర్‌లను చూపిస్తునప్పుడు షారుఖ్ ఖాన్ పక్కనే ఉన్నారు. షారుఖ్ అలా చూస్తూ ఉండిపోయారు. దీపికా చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మీడియాకే మిడిల్ ఫింగర్ చూపిస్తుందా?', 'అమ్మడు ఇంతగా రెచ్చిపోవాలా?' అంటూ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీపికా '83' సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 83లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. 

Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!

Also Read: Dil Raju: అప్పుడు తాత.. ఇప్పుడు నాన్న! మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్ అగ్ర నిర్మాత!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News