Deepika - Ranveer: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణవీర్ దంపతులు.. సెస్టెంబర్ విడుదల అంటూ ఆసక్తికర పోస్ట్..

Deepika Padukone - Ranveer Singh: గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణే గర్భవతి ఉన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈమె బేబి బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా కన్ఫామ్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 29, 2024, 12:35 PM IST
Deepika - Ranveer: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణవీర్ దంపతులు.. సెస్టెంబర్ విడుదల అంటూ ఆసక్తికర పోస్ట్..

Deepika Padukone - Ranveer Singh: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గర్భంతో ఉందనే వార్తలు గత కొద్ది రోజులుగా మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట. తాజాగా ఈ విషయాన్ని దీపికా పదుకొణే దంపతులు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
దీపికా, రణ్‌వీర్ విషయానికొస్తే.. బాలీవుడ్ ప్రేమ జంటల్లో దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ ఒకరు. ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత  2018లో వీళ్లిద్దరు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

ఇక  తొలిసారి దీపికా, రణ్‌వీర్ కలిసి 'రామ్ లీలా..గోలియోంకా రాస్‌లీలా' సినిమాలో నటించారు. ఈ మూవీలో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత 'బాజీరావు మస్తానీ' సినిమాతో అది పీక్స్‌కు చేరింది. ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. కానీ పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయారు.

ఇక రణ్‌వీర్ సింగ్, దీపికాల మ్యారేజ్ అయి ఐదేళ్లు అవుతున్న ఇప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు. అప్పట్లో వీళ్లిద్దరు ఎవరి కెరీర్ వాళ్లు కంటిన్యూ చేయాలనే ఒప్పందంతోనే వీళ్లు పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వీళ్లిద్దరు తమ ఇంట్లో కొత్త వ్యక్తి రాబోతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్‌లో డెలివరీ జరగబోతున్నట్టు చెప్పారు. అంటే దీపికా రెండు నెలలు కంప్లీటై మూడు నెలలో ప్రవేశించిందన్న మాట.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

ఇక మ్యారేజ్ తర్వాత దీపికా పదుకొణే 'పఠాన్', రీసెంట్‌గా 'ఫైటర్' సినిమాల్లో రెచ్చిపోయి నటించింది. అటు రణ్‌వీర్ సింగ్ వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు. అటు బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడా సత్తా చాటిన దీపికా పదుకొణే.. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో మే 9న  విడుదల కాబోతుంది.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News