Vishwak Sen Corona: హీరో విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకిన వైరస్!

Vishwak Sen Corona: యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకినట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన విశ్వక్ సేన్.. తన ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 05:42 PM IST
    • హీరో విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్
    • వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకిందని వెల్లడి
    • ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న విశ్వక్
Vishwak Sen Corona: హీరో విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకిన వైరస్!

Vishwak Sen Corona: దేశంలో మరోసారి కరోనా వైరస్ భయాందోళనలను రగిలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 

ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాది చిత్రసీమల్లోని కొందరు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్ వెల్లడించారు. 

"నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ ఈ వైరస్‌ సోకడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నాపై మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

దానిపై స్పందించిన ఆయనవ అభిమానులు.. కరోనా వైరస్ నుంచి విశ్వక్ సేన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల పరంగా ఇటీవలే 'పాగల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌ సేన్‌.. ప్రస్తుతం 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్‌ 'ఓరి దేవుడా' చిత్రంతో పాటు 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు విశ్వక్ సేన్.   

Also Read: Pushpa Deleted Scene: 'పుష్ప' సినిమాలోని డిలీటెడ్ సన్నివేశాన్ని మీరు చూశారా?

Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' నుంచి మరో సాంగ్ రిలీజ్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News