Commitment Movie Director says sorry: తేజస్వి మాదివాడ, అన్వేషి జైన్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన కమిట్మెంట్ అనే సినిమా ట్రైలర్ ఇటీవల బయటకు వచ్చి పెను దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు జంటలు లిప్ కిస్ సీన్లలో మునిగి తేలుతున్న వేళ వారి వెనుక ఒక భగవద్గీత శ్లోకం వినపడుతూ ఉండడంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ సినిమా ట్రైలర్ కనుక డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హిందూ సంఘాల వారు హెచ్చరించడమే కాక అవసరమైతే ఆఫీసు సైతం ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
కరాటే కళ్యాణి చేసిన నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హిందూ సంఘాల వారికి టచ్ లోకి వచ్చి అసలు తాము భగవద్గీత శ్లోకం వాడలేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయం మీద కూడా హిందూ సంఘాల వారు వెనక్కి తగ్గని నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న ఇప్పుడు తెర మీదకు వచ్చారు. నుదుటన విభూది రాసుకుని శ్రీకృష్ణుడి విగ్రహం పక్కన కూర్చుని ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
తాను కూడా ఒక హిందువునే అని తాను తన హిందూ మతాన్ని కించ పరిచే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడబోనని వెల్లడించారు. అంతేకాక తన సినిమా మీద హైప్ పెంచుకోవడం కోసం ఈ వీడియో విడుదల చేయలేదని అన్నారు. అసలు తమ టీం కానీ తాను కానీ ఈ వీడియో విడుదల చేయలేదని వెల్లడించారు. తాను చెప్పాలనుకుంటున్న సారాంశం మొత్తం ఒక శ్లోకంలో ఉండడంతో దాన్ని ట్రైలర్ కు జోడించి తన దగ్గర వారికి పంపానని అందులో కొంతమంది ఎగ్జయిట్ అయి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఇవి బయటకు వచ్చిందని అన్నారు.
అది అధికారికంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కాదని వెల్లడించారు. అయినా సరే తన హిందూ సోదరుల మనోభావాలు దెబ్బ తిన్న కారణంగా ఈ వీడియో బయటకు వచ్చినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అలాగే వీడియో పెట్టిన వారు డిలీట్ చేయాలని ఆయన వీడియోలో కోరారు.
Read Also: Shootings Bundh: షూటింగ్స్ బంద్ ఖాయం..ప్రకటించిన ఫిలిం ఛాంబర్.. మళ్లీ అప్పటి నుంచే!
Read Also: Nikhil: సినిమా రిలీజ్ అవదన్నారు.. జీవితంలో తొలిసారి ఏడ్చానన్న నిఖిల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook