Seetha Kalyana Vaibhogame: సీతా కళ్యాణ వైభోగమే మూవీ యూనిట్‌పై సీఎం రేవంత్ ప్రశంసలు

CM Revanth Reddy: సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీమ్ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్‌ను చూపించారు. మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 21న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2024, 07:46 PM IST
Seetha Kalyana Vaibhogame: సీతా కళ్యాణ వైభోగమే మూవీ యూనిట్‌పై సీఎం రేవంత్ ప్రశంసలు

CM Revanth Reddy: సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై  రాచాల యుగంధర్ నిర్మించారు. జూన్ 21న పెద్ద ఎత్తున ఆడియన్స్ ముందుకు తీసుకురానుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలే కాకుండా మన నేటివిటీని, మన ఆచార సంప్రదాయాల్ని చూపించేలా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. మన సంస్కృతిని చాటేలా.. మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ఈ చిత్రాన్ని సతీష్ పరమవేద రూపొందించారు.

Also Read: Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు సీతా కళ్యాణ వైభోగమే చిత్రయూనిట్ వెళ్లింది. ముఖ్యమంత్రికి టీజర్, ట్రైలర్‌ను చూపించారు. ట్రైలర్‌ను వీక్షించిన సీఎం రేవంత్.. చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని.. చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు. సీఎంను కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్, దర్శకుడు సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి, కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు.

ఈ సినిమా ట్రైలర్ ఇటీవల బలగం ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమాను థియేటర్స్‌లో చూసి ఆడియన్స్ మంచి విజయం అందించాలని నిర్మాత యుగంధర్ కోరారు. తాము చిన్న చిత్రంగా మొదలు పెట్టినా.. పెద్ద సినిమాగా మారిందని చెప్పారు. ఈ మూవీ కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారని చెప్పుకొచ్చారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ సినిమాతో మంచి పేరు రానుందన్నారు. ఈ చిత్రంలో గగన్ విహారి విలన్ రోల్ పోషించగా.. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. కెమెరామెన్‌గా పరుశురామ్ వ్యవహరించారు. 

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News