/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Acharya Movie to streaming in OTT platform Amazon on May 12th: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన సినిమా 'ఆచార్య'. తండ్రికొడుకుల కాంబో కావడంతో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న సినిమా విడులైంది. అయితే మొదటి షో నుంచే ఆచార్య సినిమాకు నెగెటివ్ టాక్ రావ‌డంతో.. బాక్సాఫీక్ క‌లెక్ష‌న్స్‌పై భారీ ప్రభావం చూపింది. ఓవర్సీస్ కలుపుకొని ఆచార్య చిత్రం తొలి రోజున రూ. 33 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందట. రోజురోజుకు క‌లెక్ష‌న్స్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఆచార్య సినిమాను చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారని తెలుస్తోంది. సినిమాను నాలుగు వారాల తర్వాత విడుదల చేసేలా ముందుగా ఒప్పందం చేసుకున్నారు. అయితే క‌లెక్ష‌న్స్‌ తగ్గుతున్న కారణంగా హీరో చిరంజీవి సహా అందరూ నిర్ణయం మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం చిరంజీవితో పాటుగా రామ్ చరణ్, కొరటాల శివ కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట. వీళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలంటే.. అమెజాన్ ప్రైమ్‌కు ముందుగానే సినిమాను ఇస్తే కనీసం 10 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

అనుకున్న తేదీకంటే ముందుగానే సినిమాను రిలీజ్ చేస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ తిరిగి నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తుంది. ఈ విధానాన్ని 'ఎర్లీ విండో ప్రాసెస్' అంటారు. రాధే శ్యామ్ సినిమా ఎర్లీ విండో ప్రాసెస్‌లో విడుదలైంది. చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో వచ్చేసింది. దాంతో నిర్మాతలకు అమెజాన్ రూ.25 కోట్లు అదనంగా చెల్లించింది. ఇప్పుడు ఆచార్య కూడా ముందుగానే వస్తే.. నిర్మాతలకు ఆ రకంగానైనా కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. 

ఏప్రిల్ 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మే 30న లేదా జూన్ మొదటి వారంలో ఆచార్య చిత్రం ఓటీటీలో విడుదల అవ్వాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య చిత్రం మే 12న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆచార్య సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రావడం అభిమానులకు మాత్రం శుభవార్తే అని చెప్పాలి. 

Also Read: Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. జలమయమైన హైదరాబాద్‌ మహానగరం!

Also Read: Horoscope Today May 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి సమస్యలు అధికం అవుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Chiranjeevi starrer Acharya Movie to streaming in OTT platform Amazon Prime Videos on May 12th
News Source: 
Home Title: 

Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!

Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

అభిమానులకు శుభవార్త

రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'

మే 12న ఓటీటీలోకి ఆచార్య
 

Mobile Title: 
Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, May 4, 2022 - 08:04
Request Count: 
223
Is Breaking News: 
No