Acharya OTT Date: ఓటీటీలోకి 'ఆచార్య'.. 20 రోజులకే స్ట్రీమింగ్‌! నిరాశలో ఫాన్స్

Acharya Movie OTT release Date Out. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 09:00 PM IST
  • అభిమానులకు శుభవార్త
  • ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'
  • నిరాశలో ఫాన్స్
Acharya OTT Date: ఓటీటీలోకి 'ఆచార్య'.. 20 రోజులకే స్ట్రీమింగ్‌! నిరాశలో ఫాన్స్

Acharya Movie OTT release Date Out: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఆచార్య సినిమాకు నెగెటివ్ టాక్ రావ‌డంతో.. బాక్సాఫీక్ క‌లెక్ష‌న్స్‌పై భారీ ప్రభావం చూపింది. ఓవర్సీస్ కలుపుకొని తొలి రోజున కేవలం రూ. 33 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఆచార్య సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 'వారు అతనిని ఆచార్య అని పిలుస్తారు. ఎందుకంటే.. అతను ఎల్లప్పుడూ వారికి పాఠం చెబుతాడు' అని ఓ కాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. మరోవైపు మే 20న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది.  

సాధారణంగా ఓటీటీ నిబంధనల ప్రకారం.. థియేటర్లలో విడుదల అయిన ఆరు వారాలు తర్వాత ఆచార్య సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. అయితే థియేటర్లో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ఓటీటీ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ..  20 రోజులకే స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇలా 20 రోజులకే అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రావడం మెగా అభిమానులు కాస్త  నిరాశకు గురవుతున్నారు. 

ఆచార్య సినిమా కోసం చిరంజీవితో పాటుగా రామ్ చరణ్, కొరటాల శివ కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట. వీళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలంటే.. అమెజాన్ ప్రైమ్‌కు ముందుగానే సినిమాను ఇస్తే కనీసం 10 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. అనుకున్న తేదీకంటే ముందుగానే సినిమాను రిలీజ్ చేస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ తిరిగి నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తుంది. ఈ విధానాన్ని 'ఎర్లీ విండో ప్రాసెస్' అంటారు. రాధే శ్యామ్ సినిమా ఎర్లీ విండో ప్రాసెస్‌లో విడుదలైంది. 

Also Read: Kiara Advani Images: బ్లాక్ శారీలో కియారా అద్వానీ.. ఆ నడుమందాలు మాములుగా లేవుగా!

Also Read: Model Shahana Kerala: పుట్టినరోజే మృత్యువు ఒడిలోకి నటి.. భర్తపై అనుమానాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News