Waltair Veerayya OTT update : ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పుడు, ఎక్కడంటే?

Waltair Veerayya OTT Release Date వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అసలే థియేటర్లో ఇప్పటికీ వాల్తేరు వీరయ్య ఆడేస్తోన్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2023, 02:16 PM IST
  • బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య
  • మెగాస్టార్ చిరంజీవి కెరీర్ హయ్యస్ట్
  • ఓటీటీలోకి రాబోతోన్న చిరు వాల్తేరు వీరయ్య
Waltair Veerayya OTT update : ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పుడు, ఎక్కడంటే?

Waltair Veerayya OTT Release Date మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్య చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమా థియేటర్లో రఫ్పాడించేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది వాల్తేరు వీరయ్య. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలయ్య వీర సింహారెడ్డితో పోటిలోకి వాల్తేరు వీరయ్య వచ్చింది. వీర సింహా రెడ్డి ఒక్క రోజు ముందే రిలీజ్ అయినా కూడా వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం కలెక్షన్లలో దుమ్ములేపేసింది. వీర సింహా రెడ్డిని వెనక్కి నెట్టేసి వీరయ్య సినిమా ముందుకు వెళ్లింది.

ఓవర్సీస్‌లో అయితే వీరయ్య ఆధిపత్యం క్లియర్‌గా కనిపించింది. వీర సింహా రెడ్డి వన్ మిలియన్ డాలర్ కొట్టేందుకు కిందా మీదా పడింది. కానీ వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం అవలీలగా 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. అలా వీరయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపేసింది. 250 కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

చిరంజీవి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది. అటు బాబీకి ఇటు చిరంజీవికి ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది. అసలే ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తరువాత అందరూ చిరంజీవి మార్కెట్, స్టామినాను అనుమానించారు. కానీ వాల్తేరు వీరయ్య సినిమాతో అవన్నీ ఒక్కసారిగా పటాపంచాలయ్యాయి.

ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కూడా వాల్తేరు వీరయ్య సినిమాను చూసే టైం వచ్చింది. థియేటర్లో అల్లాడించిన వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి. వాల్తేరు వీరయ్య సినిమా అయితే నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి అందుబాటులోకి రాబోతోంది.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News