Acharya Movie Review : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చిరంజీవి నటించిన ఈ మూవీ అంచనాలు అందుకుందా.. వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడా లేక ట్రాక్ దారిమళ్లిందా... ఆర్‌ఆర్ఆర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఈ చిత్రంలో తండ్రి పక్కన మెప్పించాడా...?
కథ - అడవిలో పాదఘట్టం అనే ఊళ్లో ధర్మస్థలి అనే ఆలయం నిత్యం ధర్మం పాటించే జనంతో అలరారుతుంది. గట్టమ్మ తల్లి కొలువైన ఆ ఆలయాన్ని మింగేయాలని, ఆ ప్రాంతంలో మైనింగ్ చేపట్టాలని రాథోడ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. ధర్మస్థలిలో అధర్మం ఎలా మొదలైంది.. ఎవరు కారణమయ్యారు.. అధర్మ స్థలిగా మారిన ఆ ఆలయాన్ని, ఆ ఊరిని బసవ నుంచి ఎవరు కాపాడుతూ వచ్చారు... బసవ అరాచకాలతో ఊరి జనం చింతిస్తున్న సమయంలో... తిరిగి ధర్మస్థలిలో ధర్మం ఎలా నిలబడింది. ఆచార్య అందుకోసం ఏం చేశాడు అనేది కథ.
ప్లస్ పాయింట్లు- చిరంజీవి, రామ్ చరణ్‌ల నటన, డ్యాన్సులు. ముఖ్యంగా దర్శకుడు కొరటాల కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించాడు. చిరంజీవి, చరణ్ ఇద్దరూ ఒకే తెరపై పక్కపక్కన కనిపించటం మెగా అభిమానులకు కన్నులపండువ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి డాన్సులతో పాటు రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్‌లో నటించిన విధానం కట్టిపడేసింది. పూజా హెగ్డే తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రెజీనా ప్రత్యేక పాటలో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి, అజయ్, నాజర్ తమ పాత్రల్లో మెప్పించారు.
మైనస్ పాయింట్లు- రొటీన్ కథ, కథనంలో పస లోపించటం. కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపించటం. వరుసగా భారీ సినిమాలు చూసిన ప్రేక్షకులకు థ్రిల్ అనిపించేలా సన్నివేశాలు లేకపోవటం. కొన్ని సీరియస్ ఫైట్ సీన్స్‌లో కామెడీ చొప్పించటం.
చివరగా- మెగా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. భారీ అంచనాలు పెట్టుకోవద్దు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!
Also Read: Saturn Transit 2022: నేడు కుంభరాశిలోకి శని.. ఏ రాశుల వారికి మంచిది... ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook