Chiranjeevi on RRR: ఆర్​ఆర్​ఆర్​ చూసిన చిరంజీవి.. రామ్​​ చరణ్​ నటనపై షాకింగ్ కామెంట్స్​!

Chiranjeevi on RRR: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలై.. రికార్డులు సృష్టిస్తోంది 'ఆర్​ఆర్​ఆర్​' మూవీ. ఈ మూవీని చూసిన మెరాస్టార్ చిరంజీవి.. రాణ్​ చరణ్​ నటనపై షాకింగా కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 04:21 PM IST
  • ఆర్​ఆర్​ఆర్​ మూవీపై మెగా స్టార్ చిరంజీవి రియాక్షన్​
  • రామ్​ చరణ్​ నటనపై ప్రశంసల జల్లు
  • సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్​..
Chiranjeevi on RRR: ఆర్​ఆర్​ఆర్​ చూసిన చిరంజీవి.. రామ్​​ చరణ్​ నటనపై షాకింగ్ కామెంట్స్​!

Chiranjeevi on RRR: భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న మూవీ.. 'ఆర్​ఆర్​ఆర్​'. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం.. ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​ల వంటి స్టార్లు హీరోలుగా నటించడం.. వంటివి ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ఎన్నో అంచనాల నడుమ రూ.500 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్​లలో విడుదలై.. సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా చూసిన నందమూరి, మెగా అభిమానుల సందడికి హద్దులే లేవంటే అతిశయోక్తికాదు. ఇక ప్రముఖులు సైతం ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా.. 'ఆర్​ఆర్​ఆర్​' మూవీని చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఒక్క మాటలో సినిమా అదిరి పోయిందన్నారు. ఇక అందులో రామ్​ చరణ్​ నటన చూసి చాలా గర్వంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. రామ్​ చరణ్​ ఇంటి వద్ద చిరంజీవి చేసిన ఈ కామెంట్స్​కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్​ సినిమాలు తీశారు చిరంజీవి. ఇప్పుడు తన కుమారుడు పాన్ ఇండియా స్టార్​గా గుర్తింపు తెచ్చుకోవడం కచ్చితంగా గర్వించదగ్గ విషయమేనని నెటిజన్లు అంటున్నారు.

ఆర్​ఆర్​ఆర్​ గురించి..

ఆర్​ఆర్​ఆర్​ మూవీలో ఎన్టీఆర్​, రామ్ చరణ్​లతో పాటు.. ఆలియా భట్​, అజయ్​ దేవ్​గన్ (గెస్ట్ రోల్​), శ్రేయా, సముద్రకని సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. తెలుగులో నిర్మించిన ఈ మూవీని.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ.

Also read: Nitin First Look: ఆకట్టుకుంటున్న మాచర్ల నియోజకవర్గం ఫస్ట్‌లుక్

Also read: RRR Movie: 'ఆర్ఆర్ఆర్'పై అల్లు అర్జున్ రియాక్షన్... తారక్, చెర్రీ పెర్ఫామెన్స్‌పై ప్రశంసలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News