Cinema shootings : సినిమా వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్-19 వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Last Updated : May 22, 2020, 11:53 PM IST
Cinema shootings : సినిమా వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్-19 వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read also : Cyclone Amphan : వెస్ట్ బెంగాల్‌కి రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు

సినీరంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఎన్.శంకర్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, జెమిని కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ( Read also : 20 లక్షల కోట్లు ఓ కృూరమైన జోక్ : సోనియా గాంధీ )

సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సినీరంగ ప్రముఖుల విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ.. పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, అదే సమయంలో కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటున్న అన్ని చర్యలను క్రమం తప్పకుండా పాటించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసుకునేందుకు వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించుకోవాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ( Read also : Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు )

ఈ సందర్భంగా సినీ పరిశ్రమ బతకాలని ఆకాక్షించిన ముఖ్యమంత్రి.. అదే సమయంలో కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని అభిప్రాయపడ్డారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని హామీ ఇచ్చారు. 

సినిమా షూటింగ్స్ జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోతే.. కరోనావైరస్ నివారణ చర్యలకు ఎలాంటి భంగం కలగకుండా పనులు ముందుకుసాగితే.. ఆ తర్వాత సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి కూడా చర్యలు తీసుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News