Chiranjeevi - Naga Babu: త‌మ్ముడు నాగ‌బాబును చిత‌క బాదిన చిరంజీవి.. అస‌లేం జ‌రిగిందంటే..

Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియ‌ర్ హీరో చిరంజీవి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఈయ‌న్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయ‌న‌కు కూడా కొన్ని చిలిపి జ్ఞాప‌కాలు ఉంటాయి. తాజాగా చిన్న‌పుడు త‌న పెద్ద త‌మ్ముడు నాగబాబును చితక బాదిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2024, 08:36 PM IST
Chiranjeevi - Naga Babu: త‌మ్ముడు నాగ‌బాబును చిత‌క బాదిన చిరంజీవి.. అస‌లేం జ‌రిగిందంటే..

Chiranjeevi - Naga Babu: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు త‌ర్వాత స్వ‌యంకృషితో పైకి వ‌చ్చిన హీరో. అంతేకాదు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో దాదాపు పాతికేళ్లు నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కుడిగా స‌త్తా చాటారు. తాజాగా చిరంజీవి చిన్న‌పుడు నాగ‌బాబుతో చేసిన అల్ల‌ర్ల గురించి ప్ర‌స్తావించారు.  చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు విష‌యానికొస్తే.. నటుడిగా, నిర్మాత‌గా,  జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో జ‌డ్జ్‌గా.. రాజ‌కీయ వేత్త‌గా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రోవైపు చిరు చిన త‌మ్ముడు  ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత‌గా ఏపీ రాజ‌కీయాల్లో స‌త్తా చాటుతున్నారు.

ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. చిరంజీవి ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే రోజుల్లో నాగ‌బాబును చితక‌బాదిన విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో ప్ర‌స్తావించారు. నేను ఇంట‌ర్ చ‌దివే స‌మ‌యంలో నాగ‌బాబు ఆరు, ఏడో చ‌దువుతున్నాడు. అప్ప‌ట్లో నేను అమ్మ‌కు అన్ని విష‌యాల్లో స‌హాయ‌కారిగా ఉండేవాణ్ణి. ఒక రోజు లాండ్రి నుంచి బ‌ట్ట‌లు తీసుకురావ‌డంతో పాటు నేను అదే స‌మ‌యంలో మ‌రో చోటుకు ప‌నిమీద వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నేను బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చేస‌రికి లాండ్రి నుంచి బ‌ట్ట‌లు తీసుకుర‌మ్మ‌ని నాగ‌బాబుకు చెప్పి వెళ్లాను. ఆ త‌ర్వాత నేను ప‌నిచూసుకొని ఇంటికి వ‌చ్చాను. ఈ సంద‌ర్భంగా లాండ్రీ నుంచి బ‌ట్ట‌లు తీసుకొచ్చ‌వా అని నాగ‌బాబును అడిగితే.. తీసుకురాలేదు అని నిర్లక్ష్యంగా స‌మాధాన‌మిచ్చాడు. అదే స‌మ‌యంలో ఎందుకు తేలేదు అని కాస్త గ‌ట్టిగా అడిగిస‌రికీ నిద్ర పోతున్నా అని పెడ‌స‌రిగా చెప్పాడు. దీంతో నాకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చి చావ చిత‌క బాదేశాను. అది చూసి నాపై మ‌రింత కోపం వ‌చ్చి చిన్నోడిని కొడ‌తావా అంటూ న‌న్ను బాగా తిట్టేసింది అమ్మ‌. ఆ రోజు ఈవెనింగ్ నాన్న రావ‌డంతో ఏడూస్తూ మొత్తం విషయాన్ని చెప్పేశాను. అపుడు నాగ‌బాబుకు క్లాస్ తీసుకున్నాడు. అపుడు కానీ నా కోసం చ‌ల్లార‌లేదు. అంటూ ఆనాటి సంగ‌తుల‌ను చెప్పుకొచ్చారు చిరంజీవి.

కొణిదెల నాగేంద్ర బాబు చిరంజీవి హీరోగా త‌న తల్లి అంజ‌నా దేవి పేరు మీద అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ప‌లు చిత్రాల‌ను నిర్మించారు. ఇక చిరంజీవితో రుద్ర‌వీణ‌, త్రినేత్రుడు, ముగ్గురు మొన‌గాళ్లు, బావ‌గారూ బాగున్నారా, స్టాలిన్ వంటి చిత్రాల‌ను నిర్మించారు. అటు రామ్ చ‌ర‌ణ్‌తో ఆరెంజ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అంత‌కు ముందు గుడుంబా శంక‌ర్ చిత్రాల‌ను నిర్మించారు. మొత్తంగా నిర్మాత‌గా  ప‌లు చిత్రాలు నిర్మించిన ఒక బావ‌గారూ బాగున్నారా సినిమా ఒక్క‌టే హిట్ అనిపించుకుంది. ఇంట్లో మెగా హీరోలు ఎంత మంది ఉన్నా.. వారితో హిట్ సినిమా చేయ‌లేక‌పోయారు నాగ‌బాబు.

నాగ‌బాబు అన్నయ్య చిరంజీవితో క‌లిసి రాక్ష‌సుడు, మ‌ర‌ణ మృదంగం, త్రినేత్రుడు, అంజి సినిమాల్లో క‌లిసి న‌టించారు. అందులో అంజి సినిమాలో చిరంజీవిని పెద్ద చేసి పెంచిన పెద్ద‌య్య పాత్ర‌లో న‌టించారు నాగ‌బాబు. ఆ క్యారెక్ట‌ర్ కు సంబంధించిన డైలాగ్స్‌లో చిరును ఓరేయ్, ఏరా అంటూ పిల‌వాల్సి వ‌చ్చింది. తాను అన్న‌ను అలా పిల‌వ‌లేన‌ని చెప్పాడ‌ట‌. ఈ విష‌యం చిరంజీవిని దృష్టికి రావ‌డంతో మ‌నం కేవ‌లం పాత్ర‌ల్లో యాక్ట్ చేస్తున్నామంతే. ప‌ర్వాలేదు పిలువు అన్నార‌ట‌. దీంత నాగ‌బాబు ఈ సినిమాలో ఆ పాత్ర‌ను చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్టు చిరు పేర్కొన్నారు.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News