Boss Party Song : బాస్ పార్టీ.. గ్రేసుతో కుమ్మేశాడుగా.. నిరాశ పర్చిన దేవి

Waltair Veerayya Boss Party Song చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ అంటూ ఊర్వశీ రౌతేలాతో చిరంజీవి స్టెప్పులు వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 04:56 PM IST
  • వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్
  • బాస్ పార్టీ సాంగ్ విడుదల
  • దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్ ట్రోల్స్
Boss Party Song : బాస్ పార్టీ.. గ్రేసుతో కుమ్మేశాడుగా.. నిరాశ పర్చిన దేవి

Chiranjeevi Waltair Veerayya Boss Party : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మొదటి పాట వచ్చింది. బాస్ పార్టీ అంటూ మాస్ సాంగ్‌తో ఊపేద్దామని దేవీ శ్రీ ప్రసాద్ అనుకున్నాడు. కానీ దేవీ శ్రీప్రసాద్ ట్యూన్, లిరిక్స్ జనాలను అంతగా ఆకట్టుకున్నట్టుగా అనిపించడం లేదు. కానీ కొంత మంది మాత్రం అది స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుందని కొన్ని రోజుల తరువాత అందరూ అదే బాగుందని అంటారు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పాటలో చిరు గ్రేస్ మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు.

 

అసలే ముందు నుంచి వాల్తేరు వీరయ్య పాటల మీద బాబీ హైప్ పెంచుతూనే వచ్చాడు. వాల్తేరు వీరయ్య కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఆరు మాస్ సాంగ్స్ సిద్దం చేశాడని చెబుతూనే వచ్చాడు. ఇక బాస్ పార్టీ అంటూ వచ్చిన ఈ మొదటి పాటే విమర్శలను ఎదుర్కొంటోంది. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోను అయితే మీమర్స్, ట్రోలర్స్ ఆడేసుకున్నారు. ఇప్పుడు ఈ పాటను కూడా గట్టిగానే ట్రోల్ చేసేట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఇంకా ఎలాంటి పాటలు వదులుతారో చూడాలి.

వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతి బరిలోకి దించబోతోన్నారు. మరో వైపు బాలయ్య వీర సింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలోకి రాబోతోంది. ఈ రెండు చిత్రాలను మైత్రీనే నిర్మిస్తోంది. మరి ఈ పోటిని మైత్రి ఎలా బ్యాలెన్స్ చేస్తుందో.. థియేటర్లను ఎలా కేటాయిస్తుందో.. ప్రమోషన్స్ ఎలా మెయింటైన్ చేస్తుందో చూడాలి. అసలే సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్‌లో మైత్రీ ఏ మాత్రం కాస్త బ్యాలెన్స్ తప్పినా అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సిందే.

Also Read : Naga Chaitanya Birthday : నీకు ప్రశాంతత దక్కాలి!.. చైతూకి వెంకీ మామ స్పెషల్ విషెస్

Also Read : Hero Karthikeya With cheetah : చిన్నప్పటి 'చిరు' కల నెరవేరిందట.. చిరుతపులితో హీరో కార్తికేయ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News