Megastar chiranjeevi as Hanuman: అవును మెగా ఫ్యామిలీని రామ భక్త్ హనుమంతుడిని విడదీసి చూడలేము. మెగా ఫ్యామిలీలో శివ శంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారారు. ఇక తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా తన పేరు ముందు హనుమంతుడి పవన్ పేరును చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇక చిరంజీవి తన కుమారుడికి కూడా రామ్ చరణ్ అంటూ ఆ రాముడి చరణాలను కొలిచే హనుమంతుడి పేరు పెట్టారు చిరు. ఇక చిరంజీవి తల్లిగారి పేరు హనుమాన్ తల్లి పేరు అయినా అంజనా దేవిగా ఉండటం యాదృచ్ఛికంగా కలిసొచ్చిందనే చెప్పాలి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతటి హనుమాన్ భక్తులైన ఫ్యామిలీ మరొకటి లేదేమో. ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ.. త్వరలో తాను తెరకెక్కించబోయే 'జై హనుమాన్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. హనుమాన్ వేషం వేస్తే చూడాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టిన సంగతి తెలిసిందే కదా.
దాన్ని పోషించే నటుడిని చూస్తే భక్తి భావం పొంగిపొర్లాలి. నిజ జీవితంలో కూడా భక్తి భావం ఉండాలి. చిరంజీవి గారు హనుమంతుడి పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వారి ఇమేజ్ సరితూగాలి. అందుకు చిరంజీవి పర్ఫెక్ట్ ఛాయిస్ అన్నారు. గతంలో చిరంజీవి .. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఓ సన్నివేశంలో హనుమంతుడి వేషంలో కనిపించారు. అటు ఈ సినిమాలో జై చిరంజీవా అంటూ హనుమంతుడిని కీర్తిస్తూ ఓ పాట కూడా వుంది. అటు జై చిరంజీవా అంటూ చిరు ఓ సినిమా కూడా చేసారు. అటు కొండవీటి దొంగ సినిమాలో శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అంటూ ఓ పాట కూడా ఉంది. ఈ రకంగా సినిమాల్లో సందర్భం వచ్చినపుడల్లా హనుమంతుడిపై తన భక్తి భావం చూపిస్తూనే ఉన్నాడు. ఇపుడు ప్రశాంత్ వర్మ సినిమాకు చిరు ఓకే చెప్తే పూర్తి స్థాయిలో హనుమాన్ వేషంలో మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా ఇదే అవుతుంది.
ప్రస్తుతం చిరంజీవి.. విశ్వంభర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు భామలు యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూతురు నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. అటు చిరు.. ప్రశాంత్ వర్మ.. 'జై హనుమాన్' సినిమాకు ఓకే చెబుతారా అనేది చూడాలి. ఒకవేళ ఓకే చెబితే.. హనుమంతుడిగా తమ ఫేవరేట్ హీరోను చూసుకొని అభిమానులు మురిసిపోవడం ఖాయం.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook