Chiranjeevi: 'సాయిపల్లవి నా సినిమా రిజక్ట్ చేసినందుకు సంతోషించా'..చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పొల్గొన్న మెగాస్టార్ పలు ఆంశాలు గురించి మాట్లాడారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 09:09 PM IST
  • హైదరాబాద్ లో 'లవ్ స్టోరీ' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక
  • ముఖ్య అతిథులుగా చిరంజీవి, ఆమీర్‌ఖాన్
  • సెప్టెంబరు 24న రిలీజ్
Chiranjeevi: 'సాయిపల్లవి నా సినిమా రిజక్ట్ చేసినందుకు సంతోషించా'..చిరంజీవి షాకింగ్ కామెంట్స్

 Love Story Pre Release Event: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్‌ మూవీ ‘'లవ్‌స్టోరీ'. శేఖర్‌ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ఖాన్(Amir Khan), అగ్ర కథానాయకుడు చిరంజీవి విచ్చేశారు. ‘లవ్‌స్టోరీ’ చిత్ర బృందానికి చిరు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్బంగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ..‘'భోళా శంకర్‌’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని  పేర్కొన్నారు. సాయి పల్లవి(Sai Pallavi) డ్యాన్స్‌ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్‌ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ చమత్కరించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు.

Also read: Allu Arjun-Trivikram: త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో అల్లు అ‍ర్జున్‌ షూట్.. సినిమా కోసమైతే కాదు

ఇక నాగచైతన్య(Naga Chaitanya) గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్‌ స్టర్స్‌ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే..  కూల్‌ ఫాదర్‌కి కూల్‌ సన్‌' అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తనకు రీమేక్‌ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News