Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌లపై చీటింగ్ కేసు..

Cheating Case against Bellamkonda Suresh and Srinivas:  ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 06:36 PM IST
  • నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌లపై కేసు
  • చీటింగ్ కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
  • నాంపల్లి కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌లపై చీటింగ్ కేసు..

Cheating Case against Bellamkonda Suresh and Srinivas: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ ఇద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్థిరపడ్డారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు శ్రీనివాస్‌లతో శ్రవణ్‌కు కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో 2018లో బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌లకు తాను రూ.85 లక్షలు ఇచ్చినట్లు శ్రవణ్ చెబుతున్నారు. 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా తీసుకుంటామని చెప్పి తనను మోసం చేశారని శ్రవణ్ ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలతో నాంపల్లి కోర్టులో ఇద్దరిపై ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రవణ్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. ఇద్దరిపై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ వివి వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే స్టూవర్ట్‌పురం దొంగ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు.

Also Read: Revanth Reddy-Jagga Reddy: అనూహ్యం.. రేవంత్, జగ్గారెడ్డి భేటీ... ఇద్దరి మధ్య 20ని. పాటు చర్చలు..

Also Read: Food Poisoning in School: మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులకు అస్వస్థత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి

Trending News