Charmy Kaur: ‘నీ ప్రేమని మిస్ అవుతున్న.. మళ్లీ నా జీవితంలోకి తిరిగి రా’ ..చార్మి ఎమోషనల్

Charmy Kaur Emotional Tweet: దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది హీరోయిన్ ఛార్మి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరం అయి పూరి జగన్నాథ్ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటొంది. ఈ నేపథ్యంలో చార్మి పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 02:39 PM IST
Charmy Kaur: ‘నీ ప్రేమని మిస్ అవుతున్న.. మళ్లీ నా జీవితంలోకి తిరిగి రా’ ..చార్మి ఎమోషనల్

Charmy-Puri Jagganath: ఛార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బబ్లీ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న చార్మి దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలలో కనిపించి మెప్పించింది. అనుకోకుండా ఒక రోజు.. మంత్ర లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలతో సూపర్ హిట్లు సాధించింది హీరోయిన్. అయితే సడన్ గా పర్సనల్ లైఫ్ లో అనుకోని కాంట్రవర్సీలో చిక్కుకొని హీరోయిన్ పాత్రలకు దూరమైంది. అప్పటినుంచి పూరి జగన్నాథ్ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టింది. పూరి జగన్నాథ్, ఛార్మికి మధ్య ఏదో రిలేషన్ ఉంది అనే పుకారు ఎన్నో రోజుల నుంచి వస్తున్న వార్తె. తరచుగా కలిసి కనిపించే వీరు ఈ విషయం గురించి మాత్రం ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం చార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ కాగా.. ఆ సినిమా తరువాత ఆ చిత్ర బిజినెస్ విషయంలో ఈడీ కేసులు కూడా ఎదుర్కొన్నారు పూరి జగన్నాథ్, చార్మి . ఇక ఆ చిత్రం తర్వాత నుంచి సోషల్ మీడియాకి చాలా రోజులు దూరంగా ఉన్న ఛార్మి ఇప్పుడు ఒక పోస్టుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

అసలు విషయానికి వస్తే చార్మి ప్రస్తుతం చాలా బాధలో ఉంది. ‘నువ్వు దూరం అయి రెండేళ్లు అవుతోంది.. నీ హగ్గుల్ని.. నీ ప్రేమని మిస్ అవుతున్నాను.. నువ్వే నాకు ఎంతో ఇష్టమైనదానివి కదా.. మళ్లీ నువ్వు నా జీవితంలోకి తిరిగి రా.. నీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తోంది’ అంటూ ఛార్మీ ఎమోషనల్ అయింది. ఈ క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అందరూ ఎవరికోసం చార్మి ఈ పోస్టు పెట్టింది అని ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఈ పోస్ట్ ఛార్మి పట్టింది తన కుక్క కోసం. ఇంస్టాగ్రామ్ లో చార్మి తన కుక్కతో ఉన్న ఫోటో షేర్ చేసి పైన ఉన్న విధంగా రాసుకు వచ్చింది. తన పెట్ మరణించిన రెండేళ్లు అవుతోందంటూ, విడిచి ఉండలేకపోతోన్నాను అంటూ ఛార్మీ ఎమోషనల్ అయింది. కాగా సోషల్ మీడియా అకౌంట్ వాడుటు ఉన్న కానీ ఛార్మీ తన కామెంట్ సెక్షన్‌ను మాత్రం కట్టడి చేసింది. కొంత మందికి మాత్రమే కామెంట్ చేసే సదుపాయాన్ని కల్పించినట్టుగా ఉంది. అందుకు ఎక్కువ సంఖ్యలో అక్కడ కామెంట్లు కనిపించడం లేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

ఇక సినిమాల విషయానికి వస్తే చార్మి, పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు.‌ డబుల్ ఇస్మార్ట్ అంటూ రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News