Ester Comments On Tollywood: అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!

Ester Comments On Casting Couch: తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని.. కమిట్‌మెంట్‌ ఇవ్వనందుకు కొందరు టాలీవుడ్ హీరోలు, ఫిలిం మేకర్స్‌ సినిమా ఛాన్సులు ఇవ్వలేదని హీరోయిన్‌ ఎస్తర్‌ చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 09:50 PM IST
  • అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు
  • టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు
  • అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాలి
Ester Comments On Tollywood: అందుకు నో చెప్పానని ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!

Ester Comments On Tollywood Casting Couch: ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోని మహిళలు తాము పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ 'మీ టూ' అనే ఉద్యమం మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇందులో సినీ ప‌రిశ్ర‌మకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. 'కాస్టింగ్ కౌచ్' అన్నీ రంగాల్లోనూ ఉన్నా.. మీడియా ప్రభావమేవో తెలియదు కానీ సినీ ప‌రిశ్ర‌మ‌పైనే ఫోక‌స్ ఎక్కువైంది. ప‌లువురు న‌టీమ‌ణులు, హీరోయిన్స్ సినీ ఇండ‌స్ట్రీలో తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌పై ఇప్పటికే బహిరంగంగా చెప్పారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ ఎస్తర్‌ వాలెరీ నోరోన్హ కూడా చేరారు. 

ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న ఎస్తర్‌.. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలో జరిగే సంఘటనల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని.. కమిట్‌మెంట్‌ ఇవ్వనందుకు కొందరు టాలీవుడ్ హీరోలు, ఫిలిం మేకర్స్‌ సినిమా ఛాన్సులు ఇవ్వలేదని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్‌ మాట్లాడుతూ... 'టాలీవుడ్‌లో కొత్త వారికి ఇది సర్వసాధారణం. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభ రోజుల్లో నేను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. బిగినర్స్‌కి ఇలాంటి వేధింపులు మరీ ఎక్కువగా ఉంటాయి' అని అన్నారు. 

'సినిమా అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాలి. వాటికి ఒప్పుకోకతే కెరీర్‌ ఇక్కడితోనే ముగిసిపోతుంది, ముందుకు వెళ్లలేరని బెదిరిస్తారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ నేను కూడా ఎదుర్కొన్నా. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా అర్థం అయ్యేలా చెప్తారు. ఎలా అంటే.. నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఉండిపోతావంటారు. ఇంకా చాలా చెపుతారు. ఇండస్ట్రీలో చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు' అని ఎస్తర్‌ తెలిపారు. 

'సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కానీ అదే నా జీవితం మాత్రం కాదు. అవకాశాల కోసం అంత దిగజారడం అవసరం లేదు. అందుకే నేను నో చెప్పాను. ఛాన్స్‌ రావాలంటే ఇదొక్కటే దారి అంటే.. ఆ అవకాశాలు నాకు వద్దు. తెలుగులో అవకాశాలు లేకపోయినా కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పు అని చెప్పలేం. అడగకపోయినా ఆఫర్‌ చేసేవాళ్లున్నారు, ఆఫర్‌ చేసే వాళ్లు లేకపోయినా అడిగేవాళ్లు ఉన్నారు. ఎవరినీ నేను బ్లేమ్ చేయలేను' అని ఎస్తర్‌ చెప్పుకొచ్చారు. 

'భీమవరం బుల్లోడు' సినిమాతో ఎస్తర్‌ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆపై 'గరం'లో ఓ సాంగ్‌, 'జయజయజానకి నాయక'లో చిన్న పాత్ర చేశారు. అనంతరం టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అదే సమయంలో సింగర్‌ నోయల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆరే ఆరు నెలల్లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం  ఈ అమ్మడి పలు షోలలో మెరుస్తున్నారు. 

Also Read: AC, Fridges Offers: సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు!!

Also Read: IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌.. నలుగురు సీనియర్ ఆటగాళ్లకు దక్కని చోటు! ఇక అంతే సంగతులా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News