C Kalyan Sensational Comments on Dil Raju: తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో నిర్మాతల మండలి అంటూ నిర్మాతల కోసం ఒక సంఘం ఉండేది. అయితే కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిర్మాతల మండలిలో చీలికలు వచ్చి కొంతమంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే నిర్మాతల సంఘంలో ఉన్న అందరూ యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు కాబట్టి ప్రస్తుతం యాక్టివ్ గా సినిమాలు చేస్తున్న వారందరూ కొత్త సంఘం పెట్టుకున్నారని అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆదివారం నాడు నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీ. కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేసిన కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఆయన దిల్ రాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రెస్ మీట్ లో సీ కళ్యాణ్ మాట్లాడుతూ 2019లో మేము ఎన్నికైన తర్వాత దగ్గర నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని అందుకే ఈసారి ఎవరు సంస్థకు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళని గెలిపించకూడని పేర్కొన్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన ఆయన ఈ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలని ఉద్దేశంతో ముందుకు వచ్చారని పేర్కొన్నారు. తాను ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేస్తే అధ్యక్ష పదవి మోజులో కొందరు నా ప్రయత్నాన్ని నీరుగార్చారని పేర్కొన్నారు.
దిల్ రాజు, సీ కళ్యాణ్ ప్యానల్స్ వేర్వేరు కాదని పేర్కొన్న ఆయన నిర్మాతలు కొందరు దిల్ రాజును తప్పుదోవ పట్టించారని దిల్ రాజుతో నన్ను పోలుస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా 80 చిన్న సినిమాలు చేశానని పేర్కొన్న సీ కళ్యాణ్ ఎవరినీ మోసం చేయలేదని పేర్కొన్నారు. ఇక యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ గతంలో షూటింగ్స్ ఆపివేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగలేదని పేర్కొన్నారు. నిర్మాతల మండలిలో ఇప్పుడు దామోదర్ ప్రసాద్ కార్యదర్శిగా ఉన్నారని సుమారు నాలుగువేల నుంచి ఆయనే ఉన్నారు కానీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు.
చిన్న నిర్మాతలకు నిర్మాతల మండలిలో అన్యాయం జరుగుతోంది అని పేర్కొన్న ఆయన చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ లేదని పేర్కొన్నారు. ఇక గిల్డ్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుందని, ఈ గిల్డులో 27 మంది సభ్యులు ఉంటే నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. గిల్డ్ సభ్యులు సమస్యలే ఎక్కువగా నిర్మాతల మండలి పరిష్కరించిందని అందుకే కొత్త ఓటర్లు మీకు మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు వెనుక దిల్ రాజు ప్రోద్బలమే ఎక్కువగా ఉందని టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని టార్గెట్ చేస్తూ సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ క్రమంలో రేపటి ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలుస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది మరి.
Also Read: Chiranjeevi tweet: చిరంజీవి పుత్రోత్సాహం.. కొత్త చర్చకు దారి తీస్తోందా?
Also Read: Sir Movie Day 1: అంచనాలను మించిన 'సార్'..మొదటి రోజే ఆ రికార్డు బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
C Kalyan on DIl raju: దిల్ రాజుపై సీ.కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్.. దాని వల్లే నాశానం అంటూ!