Brahmamudi: రాజ్‌ను ఇంప్రెస్‌ చేసిన కావ్య.. ఇక నుంచి నో దుబారా ఖర్చంటూ హుకూం..

Brahmamudi Today December 23 Episode: సోమవారం ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో బ్యాంక్‌ అధికారులు కావ్య ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటారు. ఆరోజే రూ.20 కోట్లు పే చేస్తామని ఒప్పిస్తుంది. డాక్యుమెంట్లు తయారు చేసి ఇన్ఫామ్‌ చేస్తాం. వచ్చి డబ్బులు కట్టండి అని వెళ్లిపోతారు బ్యాంకు అధికారులు.

Written by - Renuka Godugu | Last Updated : Dec 23, 2024, 10:14 AM IST
Brahmamudi: రాజ్‌ను ఇంప్రెస్‌ చేసిన కావ్య.. ఇక నుంచి నో దుబారా ఖర్చంటూ హుకూం..

Brahmamudi Today December 23 Episode:  వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రాజ్‌ కావ్యాను మెచ్చుకుంటాడు. అప్పుడే శృతి మేడం రాబోయే 24 గంటల్లో వర్షం పడేలా ఉంది మేడమ్‌ అని జోక్‌ చేస్తుంది. నీ పని నువ్వు చేసుకో వెళ్లు అంటుంది కావ్య సిగ్గుపడుతూ.. ఇక దుగ్గిరాలవారి ఇంట ధాన్యం, రుద్రాణీలు రచ్చ మొదలు పెడుతారు. టీ నువ్వు ఎందుకు కాస్తున్నావ్‌ అంటుంది ధాన్యంతో రుద్రాణీ. రాజ్‌ లైఫ్‌లో కావ్యను ఇంట్లో కాదు ఆఫీసులో కూడా అడుకుపెట్టనివ్వను అని చాణక్య శపథం చేశాడు. ఇప్పుడు టింగురంగా అంటూ చెట్టాపట్టాల్‌ వేసుకుని వెళ్లారు. నువ్వు సీరియస్‌గా తీసుకోవడం లేదు అని ధాన్యాన్ని రెచ్చగొడుతుంది రుద్రాణీ.

మరోవైపు ఆఫీసులో రాజ్‌ కావ్యను పొగడ్తలతో ముంచెతుత్తుంటాడు.. తాతయ్య మాట పోతుంది కడదామంటే అమౌంట్‌ లేదు. ఎన్నో విషయాల్లో నీపట్ల నేను మొండిగా ఉన్నా.. ఈ విషయంలో నువ్వు కరెక్ట్‌ అనుకున్నా సమస్య సాల్వ్‌ చేశావ్‌ అంటాడు. మీరు సంతోషంగా ఉన్నారు అదే చాలు అంటుంది కావ్య. మొత్తానికి ఈ బ్యాంక్‌ సమస్య 20 శాతం తగ్గిపోయింది. ఎలా కట్టాలి? అని ఆలోచిస్తుంటారు. ఈరోజు నుంచి పని ఎక్కువ ఉంటుంది, లేబర్‌ను అవుట్‌ సోర్సింగ్‌ తీసుకోండి అని అసిస్టెంట్‌కు చెబుతాడు. కావ్య కొన్ని సూచనలు చేస్తుంది. కానీ, సార్‌ అవుట్‌ సోర్సింగ్‌ నుంచి టెంపరెరీగా తీసుకుంటే డబ్బు అడ్జస్ట్‌ చేయడం కష్టం. రూ.20 లక్షలతో వర్క్‌ చేయించండి అంటాడు రాజ్‌.

ఏవండి ప్రాబ్లెమ్స్‌ అన్ని సాల్వ్‌ అయ్యాయి కదా రిలాక్స్‌ అవ్వండి అంటుంది కావ్య. ఇంట్లో కొంచెం డబ్బు ఉంది దాంతో నేను మేనేజ్‌ చేసుకుంటా అంటుంది కావ్య. తాకట్టు పెట్టిన ప్రాపర్టీ అంతా బయటకు తీయాలి. రూ.20 కోట్లు నెలకు కట్టాలి అంటాడు రాజ్‌. దుగ్గిరాల వారి ఇంట స్వప్నను డబ్బు ఇవ్వమని అడుగుతుంది రుద్రాణీ. నాలుగు లక్షలు కావాలి అంటుంది. ముందు కారణం చెప్పండి అంటుంది. ఏయ్‌.. ఎందుకు ఇవ్వవు అంటాడు రాహుల్‌. నీకంటే నీ చెల్లే నయ్యం కదే అంటుంది రుద్రాణీ. ఎవరిని అడిగితే డబ్బు వస్తుంది  నాకు తెలుసే అంటుంది. ధాన్యలక్ష్మికి చెబితే చచ్చినట్లు నా చేతిలో పెడతావు అని మూడు సెకన్ల టైం ఇస్తుంది రుద్రాణీ. వెంటనే డబ్బు తెచ్చి చేతిలో పెట్టబోతుంది స్వప్న. అప్పుడే కావ్య ఆగక్కా.. అంటుంది. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావ్‌ అక్క అంటుంది. ఇవ్వకపోతే ధాన్యలక్ష్మికి చెబుతా అంటున్నారు. నువ్వు ఒకపూట లేకపోతే గొడవ జరుగుతుందని నేనే తెచ్చా అంటుంది స్వప్న. అక్క నీకు తాళాలు ఇచ్చానని వీళ్లు ఆటమొదలెట్టారు.

ఇదీ చదవండి: ఓరియో బిస్కెట్ తింటున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడతారు!

ఇంత డబ్బువీరు దాటేస్తారని ఊహించలేదు అంటుంది కావ్య. అక్క..  ఆ డబ్బులు, తాళాలు ఇటు ఇవ్వు, వెళ్లి అందరినీ ఒకసారి రమ్మను అంటుంది కావ్య. అప్పుడే కావ్య ఏంటి అందరినీ రమ్మన్నావ్‌ అంటుంది అపర్ణ. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు మాట్లాడితే లక్షలు అడుగుతున్నారు. మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెడుతున్నారు. ఇక నుంచి ఇంట అంతా నేనే చూసుకుంటా. తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. పెట్రోల్‌ కొట్టించినా నాకు బిల్‌ చూపించాలి అని హుకుం జారీ చేస్తుంది. రుద్రాణీ ధాన్యాన్ని ఎగదోలుతుంది.

ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?  

మీరు ఆమెకు చెబుతున్నారంటే ఆవిడకు కూడా రూల్స్‌ వర్తిస్తాయి. ఆడంబరాలకు నగలు చేయించడం కుదరదు అంటుంది కావ్య. ఇంటి తాళాలు చేతికి వచ్చేసరికి కొమ్ములు పెరిగాయా? అంటుంది ధాన్యం. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఈ రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి అంటుంది కావ్య. మా అమ్మనాన్నే ఈ రూల్స్‌ పెట్టలేదు నువ్వేం రూల్స్‌ పెడుతున్నావ్‌? అంటుంది రుద్రాణీ. ఇందిరాదేవి వెంటనే అమ్మ నాన్నలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? నాకు అసలు కూతురే లేదు. నేను నీకు అమ్మను ఏంటి? నా భర్త నీకు నాన్నెంటి? అంటుంది. అంటే ఈ కావ్య చెప్పిందే ఇంట్లో నడుస్తుందా? అంటుంది ధాన్యం .

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News