Aryan Khan in Drugs Case: 25 రోజుల తరువాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూర్

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న షారుక్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 06:02 PM IST
  • ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు
  • అరెస్టయినప్పటి నుండి అర్ధర్ రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్
  • బలంగా వాదనలు వినిపించిన ఆర్యన్ తరపు న్యాయవాది
Aryan Khan in Drugs Case: 25 రోజుల తరువాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూర్

Bombay High Court Grants Bail to Aryan Khan in Drugs Case: ఎట్టకేలకు బాలీవుడ్ బాద్ షా... షారుక్ ఖాన్ (Shahrukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan)కు బెయిల్ మంజూరయ్యింది. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు దాన్ని నిరాకరించిన సంగతి తెలిసిందే! చివరగా ఆర్యన్ కు బెయిల్ లభించటంతో షారుఖ్ కుటుంబ సభ్యులతో పాటూ..  అభిమానులు, బాలీవుడ్ (Bollywood) వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అరెస్టయినప్పటి నుండి ఆర్యన్ ఖాన్ అర్ధర్ రోడ్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే!

మంగళవారం ఎన్‌సీబీ (NCB), ఆర్యన్‌ఖాన్‌ ఇరువైపుల న్యాయవాదులు బలంగా తమ వాదనలను వినిపించారు. మొదట NCB ఆర్యన్ ఖాన్ బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేఖించింది, కానీ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ను ప్రశ్నించారు. 

Also Read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం

అర్బాజ్ మర్చంట్ (Arbaaz Merchant) తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ (Amit Desai).. "అరెస్ట్ చేయటానికి ఎన్‌సీబీ వద్ద సరైన ఆధారాలు లేవని అరెస్ట్ చేసిన మెమో చూస్తే తెలుస్తుంది. చేయని నేరానికి అనవసరంగా అరెస్ట్ చేసారు. అర్బాజ్ నుండి 6 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనమా చేసుకున్నారు. ఎన్‌సీబీ (NCB) తన వాదనలను బలపరచటానికి మాత్రమే వాట్సాప్ చాట్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. అయితే చేసిన అరెస్ట్ కు వాట్సాప్ చాట్ కు మధ్య సంబంధం ఏంటి అని అడిగారు. కోర్టులు ఎన్‌సీబీ ప్రెవేశపెట్టిన సాక్ష్యం 65B కింద చెల్లదు అని తెలిపారు".  

బెయిల్ కోసం న్యాయమూర్తి సాంబ్రే (Mumbi Hight Court Sambrey) ముందు న్యాయవాదులు అమిత్ దేశాయ్, ముకుల్ రోహత్గీ హాజరయ్యారు. అర్బాజ్ మర్చంట్ కోసం కోర్టులో పోరాడుతున్న అమిత్ దేశాయ్ కూడా ఆర్యన్ ఖాన్ బెయిల్‌కు అనుకూలంగా వాదనలు వినిపించారు. 

Also Read: Mystery Deaths: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఒకే చెరువులో ముగ్గురు యువతుల మృతదేహాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News