Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల విక్రమ్ వేద టీజర్ అద్దిరిపోయిందిగా

Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద అద్భుతమైన టీజర్ విడుదలై హల్‌చల్ చేస్తోంది. పుల్ యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి నటన పరిధి దాటేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2022, 12:16 PM IST
Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల విక్రమ్ వేద టీజర్ అద్దిరిపోయిందిగా

Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద అద్భుతమైన టీజర్ విడుదలై హల్‌చల్ చేస్తోంది. పుల్ యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి నటన పరిధి దాటేసింది.

బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద అద్భుతమైన టీజర్ విడుదలైంది. ఈ సినిమా టీజర్ అంతా యాక్షన్‌తో నిండి కన్పిస్తోంది. కచ్చితంగా ప్రేక్షకులకు మంచి సర్ప్రైజ్ కాగలదని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్ ద్వారా ఆసక్తికరమైన కథతో సినిమా ఉండనుందని తెలుస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల ఈ టీజర్ విక్రమ్ వేద ప్రపంచాన్ని సంపూర్ణంగా చిత్రీకరించి చూపించింది. టీజర్‌లో ఆకట్టుకునే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌తో టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే..సినిమా అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు.

నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, నిర్మాతలైన పుష్కర్, గాయత్రిల సోషల్ మీడియా వేదికలపై టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్, వ్యూస్ లభిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 30 దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News