Karan Johar: దక్షిణాది పాన్ ఇండియా సినిమాలు ఉత్తరాదిన ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం..
ఇటీవలి కాలంలో దక్షిణాది పాన్ ఇండియా సినిమాలు ఉత్తరాదిని, మొత్తం దేశాన్ని షేక్ చేస్తున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఇలా అన్ని సూపర్ డూపర్ హిట్స్‌తో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ మేనియా ముగియకముందే కేజీఎఫ్ 2 మేనియా ఉత్తరాదిన దుమ్ము రేపుతోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాక్సాఫీసునే కదిలించేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్లకు పైగా వసూళ్లు చేసిన కేజీఎఫ్ 2..ఒక్క హిందీ వెర్షన్ వసూళ్లే 450 కోట్లు దాటేశాయి. ఉత్తరాదిన భారీ ఆదరణతో సినిమా దూసుకుపోతోంది.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే కేజీఎఫ్ సినిమా తాము తీస్తే..నచ్చి ఉండేది కాదని విమర్శించాడు. నేరుగా విమర్శకులపై ఆరోపణలు చేశాడు. దక్షిణాదివాళ్లు తీస్తే నచ్చిన సినిమా..ఉత్తరాదివాళ్లు తీసుంటే నచ్చేది కాదని వ్యాఖ్యానించాడు. నిజానికి కేజీఎఫ్ ఛాప్టర్ 2 తనకు బాగా నచ్చిందని చెప్పాడు. అయితే తాము తీసుంటే మాత్రం విమర్శకులు దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం, నెగెటివ్ కామెంట్స్ చేయడం, ప్రోత్సహించకపోవడం చేసుండేవారని అసహనం వ్యక్తం చేశాడు.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2తో పాటుగా విడుదలైన బాలీవుడ్ సినిమాలు పూర్తిగా నిరాశ మిగిల్చాయి. కనీస వసూళ్లు కూడా లేక భారీ డిజాస్టర్లుగా మారాయి. 1-2 సినిమాలైతే ప్రేక్షకుల్లేక షో రద్దు చేసుకున్న పరిస్థితి. బాలీవుడ్ పరిశ్రమలో ముందు నుంచే ఉత్తరాది, దక్షిణాది వ్యత్యాసం స్పష్టంగా ఉంది. అక్కడి ప్రతి ఒక్క హీరో, దర్శక, నిర్మాతలు ఆ లైన్ గుర్తుంచుకునే వ్యాఖ్యలు చేస్తుంటారు.
దక్షిణాది సినిమాలు వరుసగా ఉత్తరాదిపై ఆదిపత్యం చెలాయిస్తున్న తరుణంలో సహనం కోల్పోయి కరణ్ జోహార్ ఇలా మాట్లాడినట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా దక్షిణాది సినిమా ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. సినిమాలో నిజంగా సత్తా ఉంటే..సినీ విమర్శకుల ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు, ర్యాంకింగ్ నిలవదనే వాస్తవాన్ని కరణ్ జోహార్ మర్చిపోయాడు. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఉత్తరాది విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చినా..సూపర్ హిట్ మూవీగా మారింది. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ సినిమా విక్రమ్ గురించి కూడా కొందరు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్‌గా భారీ కలెక్షన్లు సాధిస్తోంది.
Also read: Tees Maar Khan Teaser: ఏ పాప.. మరీ ఇంత పబ్లిక్‌లో ఎలా! ఇంట్లో అయితే బాగుంటుంది కదా..
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook