RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్‌ల పారితోషికం ఎంతో తెలుసా

RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నటీనటుల పారితోషికం కూడా ఎక్కువే ఉంది. ఉత్తరాది నటులు అజయ్ దేవగణ్, అలియా భట్‌లు తీసుకున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2022, 06:25 AM IST
  • ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్‌ల పారితోషికం హాట్ టాపిక్
  • కేవలం 20-30 నిమిషాల పాత్రకు అలియా భట్ 9 కోట్లు, అజయ్ దేవగణ్ 35 కోట్ల పారితోషికం
  • ఉత్తరాదిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జీరో మార్కెట్ కావడమే కారణం
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్‌ల పారితోషికం ఎంతో తెలుసా

RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నటీనటుల పారితోషికం కూడా ఎక్కువే ఉంది. ఉత్తరాది నటులు అజయ్ దేవగణ్, అలియా భట్‌లు తీసుకున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.

టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బాహుబలి దర్శకుడజు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు ఉత్తరాది నటులు అజయ్ దేవగణ్, అలియా భట్‌లు నటించారు. ఈ ఇద్దరూ సినిమాలో కన్పించేది కేవలం ఓ 20-30 నిమిషాలు మాత్రమే. అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో లీడింగ్ లేడీ కావడం విశేషం. అటు అజయ్ దేవగణ్ (Ajay Devgan) తక్కువ సేపు కన్పించినా పాత్ర కీలకంగా ఉండనుంది. మరోవైపు ఉత్తరాదిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు ఈ ఇద్దరూ. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఉత్తరాదిన జీరో మార్కెట్ వాల్యూ ఉంది. 

అందుకే రాజమౌళి..అలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్‌లకు భారీగానే పారితోషికం ఇచ్చాడు. అలియా భట్‌కు ముంబైలో ఇతర నిర్మాతలు చెల్లించినట్టే...20 నిమిషాల పాత్రకు 9 కోట్ల రూపాయలు చెల్లించారు. అటు అజయ్ దేవగణ్‌కు 7 రోజుల పనికి 35 కోట్లు పారితోషికం చెల్లించారు. ఉత్తరాది, దక్షిణాది రెండింటికీ తెలిసిన రాజమౌళి..ఈ సినిమాను మార్కెట్ చేసేందుకు సరిపోతారా మరి. ఇదే ఆసక్తిగా మారింది.

Also read: Eyy Bidda Idhi Naa Adda : య్యూట్యూబ్‌లో పుష్ప మూవీ మాస్ సాంగ్ ఫుల్ వీడియో హల్‌చల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News