Bindu Madhavi: అలాంటిది నాకు వద్దు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధు మాధవి!

Actress Bindu Madhavi Epic reply to Netizen. తాజాగా బింధు మాధవికి సోషల్ మీడియాలో చెదు అనుభవం ఎదురైంది. బిందు డ్రెస్సింగ్ వల్ల గౌరవం పోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 3, 2022, 11:28 AM IST
  • అలాంటిది నాకు వద్దు
  • నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధు
  • ఓటీటీలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ
Bindu Madhavi: అలాంటిది నాకు వద్దు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధు మాధవి!

Bigg Boss OTT Winner Bindu Madhavi strong counter to Netizen: తెలుగమ్మాయి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అవకాయ బిర్యానీ'తో బిందు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆపై రామ రామ కృష్ణ కృష్ణ, బంపరాఫర్ సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో.. కోలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బిందు.. అద్భుత ఆటతో టైటిల్ విన్నర్‌గా నిలిచారు.

తాజాగా బింధు మాధవికి సోషల్ మీడియాలో చెదు అనుభవం ఎదురైంది. బిందు డ్రెస్సింగ్ వల్ల గౌరవం పోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. విషయంలోకి వెళితే... బిగ్‏బాస్‌లో ఉన్నప్పుడు బిందు తన ఆటతీరు, ఆటిట్యూడ్‏తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇతర కంటెస్టెంట్స్ అందరూ తమ బాడీని ఎక్స్ పోజ్ చేస్తే.. బిందు మాత్రం సంప్రదాయమైన దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ప్యాషన్ డ్రెస్ వేసినా.. స్కిన్ షో మాత్రం పెద్దగా ప్రదర్శించలేదు. 

తాజా చేసిన పోస్ట్‌లో మాత్రం బింధు మాధవి ట్రెండి డ్రెస్‌లో కనిపించి కాస్త ఎద అందాలు ఆరబోశారు. ఈ ఫొటోపై ఓ నెటిజన్‌ తన  అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. బిందు మాత్రం సంప్రదాయమైన దుస్తుల్లో ఆకట్టుకున్నారు. దీంతో ఆమె అంటే గౌరవం పెరిగింది. అయితే ఇప్పుడు ఆ గౌరవం పోయింది. మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే బిందు హౌజ్‌లో అలా ఉంది' అంటూ కామెంట్ చేశారు. దీనిపై బిందు స్పందిస్తూ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ఓ వ్యక్తి వేసుకునే బట్టే గౌరవం ఇస్తారంటే.. అలాంటి రెస్పెక్ట్ నాకు వద్దు' అని రిప్లై ఇచ్చారు.

Also Read: శృంగారంపై స్టార్ ప్రోడ్యూసర్‌ ప్రశ్న.. దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన కరీనా కపూర్‌!

Also Read: Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News