సూపర్ స్టార్ కృష్ణకు బిగ్ బాస్ నివాళి.. ఆ పాటతో కంటెస్టెంట్లలో అయోమయం

Bigg Boss Team Tributes To Super Star Krishna బిగ్ బాస్ టీం నిన్నటి ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించింది. బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు ఈ విషయాన్ని చెప్పి కృష్ణకు నివాళి అర్పించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 06:58 AM IST
  • సూపర్ స్టార్ కృష్ణ మరణం
  • బిగ్ బాస్ ఇంట్లో నివాళి
  • ఆ పాటను ప్లే చేసిన బిగ్ బాస్
సూపర్ స్టార్ కృష్ణకు బిగ్ బాస్ నివాళి.. ఆ పాటతో కంటెస్టెంట్లలో అయోమయం

Bigg Boss Team Tributes To Super Star Krishna : బిగ్ బాస్ ఇంట్లో రోజు మార్నింగ్ ఓ పాటను ప్లే చేస్తుంటారు. ఆ పాటకు తగ్గట్టుగానే ఆరోజు మూడ్ ఉంటుంది. టాస్కులు ఉంటాయి. పాటల్లోని అర్థాలను బట్టి టాస్కులు ఎలా ఉంటాయ్.. ఆ రోజు ఎలా గడుస్తుందనే దాని మీద ఓ అంచనాకు రావొచ్చు. కానీ నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్ జూంబారే జూ జూంబారే అనే పాటను ప్లే చేశారు. దీంతో కంటెస్టెంట్లు ఆలోచనలో పడ్డారు.

ఇప్పుడు ఈ పాట ఎందుకు ప్లే చేశారు? అని తన అనుమానాన్ని బయటపెట్టేసింది శ్రీ సత్య. అయితే కొంత సమయానికి బిగ్ బాస్ అందరినీ లివింగ్ ఏరియాకు పిలిచాడు. అక్కడ స్క్రీన్ అసలు విషయాన్ని చెప్పాడు. 350కి పైగా చిత్రాల్లో నటించి.. తెలుగు వారికి సూపర్ స్టార్‌గా నిలిచిన కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అంటూ అసలు విషయాన్ని చెప్పాడు బిగ్ బాస్.

ఏమైనా విజువల్స్ వేస్తాడా? అని అనుకుంటే.. కేవలం సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అని వేశాడు. కృష్ణ మరణ వార్తను విని ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. సత్య అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది. తన ఇంట్లో వాళ్లు గుర్తొచ్చారంటూ చెప్పుకొచ్చింది. ఎవరైనా చనిపోయారనే వార్త తెలిసి చాలా బాధ వేస్తుందంటూ సత్య కాస్త అతి చేస్తుండగా.. ఆమెను ఓదార్చే పనిలో శ్రీహాన్ పడ్డాడు.

నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్‌లు దారుణాతి దారుణంగా ఆడారు. రేవంత్ తన టెంపర్‌ను కోల్పోయాడు. ఇనయ చివరి వరకు పోరాడింది. నిజంగానే గేమర్ అనిపించుకుంది. ఆడ పులిలా చివరి వరకు నిలబడింది కానీ రేవంత్ టాస్కులో గెలిచి.. కెప్టెన్ అయ్యాడు.

Also Read : Kantara OTT Release Date : ఓటీటీలోకి కాంతారా.. ఎప్పుడు ఎక్కడంటే?

Also Read : Sunitha Boya Nude Protest: బన్నీ వాసు మోసం చేశాడంటూ నగ్నంగా నిరసనకు దిగిన నటి సునిత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News