Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 త్వరలోనే..సెలెబ్రిటీలపైనే దృష్టి

Bigg Boss Telugu Season 5: తెలుగు టీవీ స్క్రీన్‌లో అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ముగిసింది. మరి సీజన్ 5 అప్పుడే ప్రారంభం కాదనుకుంటున్నారా..కానేకాదు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కు రంగం సిద్ధమౌతోందని సమాచారం.

Last Updated : Jan 27, 2021, 06:47 PM IST
Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 త్వరలోనే..సెలెబ్రిటీలపైనే దృష్టి

Bigg Boss Telugu Season 5: తెలుగు టీవీ స్క్రీన్‌లో అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ముగిసింది. మరి సీజన్ 5 అప్పుడే ప్రారంభం కాదనుకుంటున్నారా..కానేకాదు. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కు రంగం సిద్ధమౌతోందని సమాచారం.

బిగ్‌బాస్ షో ( Bigg Boss Show )..అతిపెద్ద రియాలిటీ షో. దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో ప్రారంభమై పలు సీజన్లు దాటుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్న షో. బిగ్‌బాస్ హిందీలో 14వ సీజన్ ( Bigg Boss Hindi season 14 ) నడుస్తోంది. బిగ్‌బాస్ తెలుగు ( Bigg Boss Telugu )లో నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. నాలుగవ సీజన్ మాత్రం కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ( Bigg Boss Telugu Season 4 Grand finale ) ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బిగ్‌బాస్ క్రేజ్‌ను ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. 

గత సీజన్ ఆలస్యమైన నేపధ్యంలో 5వ సీజన్‌ను త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ( Bigg Boss Telugu season 5 ) పనుల్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని మార్పులు చేయనున్నారట. బిగ్‌బాస్ 4వ సీజన్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. కంటెస్టెంట్లలో ఎక్కువ మంది సెలెబ్రిటీలు కాకపోవడం, యూట్యూబర్లు, యాంకర్లను తెచ్చిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లో సెలెబ్రిటీలపైనే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ఈసారి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న నాగార్జున ( Nagarjuna ) సైతం సెలెబ్రిటీల్ని ఎంపిక చేయాల్సిందిగా సూచించారని సమాచారం. ఈ నేపధ్యంలో జబర్దస్త్ ఆది, యాంకర్ రవి పేర్లు ప్రస్తుతానికి విన్పిస్తున్నాయి.

Also read: Acharya teaser: Chiranjeevi ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News