Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!

Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. ఈ పోటీలో ఇంటి సభ్యులందరూ పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 02:27 PM IST
    • బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు బంపర్ ఆఫర్
    • టికెట్ టూ ఫినాలే టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్
    • ఒక్క సభ్యుడికి ఫైనల్ కు చేరే అవకాశం
Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!

Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ తెలుగు సీజన్-5 చివరి అంకానికి చేరుకుంది. ‘కింగ్’ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో మరో రెండు వారాల్లో ముగియనుంది. టాప్‌ 7 కంటెస్టెంట్స్‌ ఫైనలిస్ట్‌గా తామే ఉండాలని గట్టి పోటీనిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే టాస్క్ ను నిర్వహించి.. అందులో గెలిచిన ఒక సభ్యుణ్ణి సరాసరి ఫైనల్ అర్హత పొందుతారని ప్రకటించాడు.  

టికెట్ ఫినాలే టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు మూడు ఛాలెంజ్ ల్లో పాల్గొనాల్సి ఉంది. వాటిలో చివరి వరకు ఉండి.. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో.. వాళ్లే తొలి ఫైనలిస్టుగా నిలుస్తారు. 

బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఎండ్యూరెన్స్‌ ఛాలెంజ్‌లో భాగంగా పోటీదారులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? మరో రెండు ఛాలెంజ్‌లు ఏంటి? 'ఫినాలే' టికెట్‌ ఎవరు గెలుచుకున్నారో తెలియాల్సి ఉంది.  

Also Read: Srimukhi : శ్రీముఖి పాట‌ విని స్పృహ కోల్పోయిన నాగబాబు, వైర‌ల్‌ అవుతోన్న వీడియో

Also Read: 83 Trailer Out: కపిల్‌ దేవ్‌ 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది.. భారత అభిమానులకు గూస్ బంప్సే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook   

Trending News