Bigg Boss Telugu season 5: బిగ్ బాస్ తెలుగు 5 నామినేషన్స్‌.. తొలి రోజే Vishwa vs Jessi, VJ Sunny vs Sarayu

Bigg Boss Telugu season 5 day 1 nominations: బిగ్ బాస్ హౌజ్‌లో తనకు, మోడల్ జెస్సీకి మధ్య జరిగిన ఓ ఘటన విషయంలో జెస్సీ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని చెబుతూ జెస్సీని విశ్వ నామినేట్ చేశాడు. ఈ క్రమంలోనే విశ్వ (Bigg Boss contestant Vishwa) ఎక్స్‌ప్లేనేషన్ ఇవ్వబోతుండగా.. జెస్సీ మధ్యలోనే అడ్డుపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 01:21 PM IST
  • బిగ్ బాస్ హౌజ్‌లో మొదలైన మాటల యుద్ధం.
  • తొలి రోజు నామినేషన్స్‌లోనే సభ్యుల మధ్య రచ్చ రచ్చ
  • కన్నీళ్లు పెట్టుకున్న మోడల్ జెస్సి
Bigg Boss Telugu season 5: బిగ్ బాస్ తెలుగు 5 నామినేషన్స్‌.. తొలి రోజే Vishwa vs Jessi, VJ Sunny vs Sarayu

Bigg Boss Telugu season 5 day 1 nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైన తర్వాత తొలి రోజే కొంతమంది సభ్యుల మధ్య తీవ్ర వాగ్వీవాదం చోటుచేసుకుంది. బిగ్ బాస్ హౌజ్‌లో తనకు, మోడల్ జెస్సీకి మధ్య జరిగిన ఓ ఘటన విషయంలో జెస్సీ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని చెబుతూ జెస్సీని విశ్వ నామినేట్ చేశాడు. ఈ క్రమంలోనే విశ్వ (Bigg Boss contestant Vishwa) ఎక్స్‌ప్లేనేషన్ ఇవ్వబోతుండగా.. జెస్సీ మధ్యలోనే అడ్డుపడ్డాడు. దీంతో విశ్వ మరింత ఆగ్రహంతో జెస్సీపై మండిపడ్డాడు. అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది కానీ ఇలా చేయాల్సిన పని లేదు అని వారించబోయాడు. 

ఇలా ఈ ఇద్దరి మధ్య వాగ్వీవాదం జరుగుతున్న క్రమంలోనే తోటి కంటెస్టంట్స్ జెస్సీని (Bigg Boss contestant Jessie) వారించారు. ఎవరైనా ఒకరిని నామినేట్ చేసేటప్పుడు అందుకు కారణం చెబుతారు. అలాగే విశ్వ కూడా నిన్ను నామినేట్ చేసే క్రమంలో తన వివరణ ఇస్తున్నాడు. అతడికి అడ్డుపడొద్దు అని చెప్పడంతో అంతటితో వెనక్కి తగ్గిన జెస్సీ.. సరే చెయ్యమని కొంత రూడ్‌గా చెప్పాడు. 

జెస్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టిన విశ్వ.. అలా చెప్పొద్దని, ఇక్కడ నీ యాటిట్యూడ్ చూపించొద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5‌ లో తొలి రోజు నామినేషన్స్ సందర్భంగా మొట్టమొదటిసారిగా చోటుచేసుకున్న వాగ్వీవాదం ఇదే. 

Also read : Bigg Boss Today's Promo: నామినేషన్స్ స్టార్ట్...నీ ఆటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో.. (వీడియో))

ఆ తర్వాత నామినేషన్స్ పర్వం కొనసాగుతుండగానే వీజె సన్నీకి సరయుకు (Bigg Boss contestant VJ Sunny) మధ్య మరో వాగ్వీవాదం చోటుచేసుకుంది. సరయును నామినేట్ చేసిన వీజె సన్నీ.. ఆమె తనను ఏకవచనంతో సంభోధించిన తీరు నచ్చలేదని, అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నానని కారణం చెప్పాడు. వీజె సన్ని వివరణపై స్పందించే ప్రయత్నంలో సరయు మరోసారి సన్నీని నువ్వు అని సంభోదించింది. దీంతో సరయులో (Bigg Boss contestant Sarayu) ఈ అంశమే నచ్చకే తాను ఆమెను నామినేట్ చేయాల్సి వచ్చిందన్నాడు సన్ని. ఒకసారి ఏకవచనంతో సంబోధించడమే నచ్చలేదని చెబుతుంటే.. మరోసారి నువ్వు అని సంబోధించి చేసిన తప్పే మళ్లీ మళ్లీ ఎలా చేస్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తంచేశాడు. 

సన్ని చెబుతున్న కారణంపై సరయు స్పందిస్తూ.. ''తప్పు చేయడం మనిషి లక్షణం అని.. తాను మనిషినే కాబట్టే రెండోసారి తప్పు చేశాను'' అని బదులిచ్చింది. సరయు ఇచ్చిన జవాబుపై అసంతృప్తి వ్యక్తంచేసిన వీజే సన్ని.. '' మంచి మనుషులకు ఒకసారి చెబితే అర్థం చేసుకుంటారని.. అలా నేర్చుకోలేని వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదు '' అని చెబుతూ సన్నీ (VJ Sunny) మరోసారి అసహనానికి గురయ్యాడు. 

Also read : Lobo Viral Interview: బిగ్‌బాస్‌కు దండంరా అయ్యా... ఇపుడదే షోలో కంటెస్టెంట్‌గా లోబో!

సన్ని ఇచ్చిన జవాబుపై సరయు మరోసారి స్పందిస్తూ.. '' నన్ను నామినేట్ చేయాలనుకున్నప్పుడు చేసేయ్.. ఇదంతా ఎందుకు'' అని మధ్యలోనే అడ్డం పడింది. దీంతో 'సరయులో ఈ యాటిట్యూడ్ నచ్చకే నామినేట్ చేస్తున్నా' అంటూ ఆమెని నామినేట్ చేశాడు. అలా సన్ని, సరయు మధ్య రెండో వాగ్వీవాదం చోటుచేసుకుంది. అలా మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu season 5) తొలి రోజు నామినేషన్స్‌ సీనే వాగ్వాదాలకు వేదికైంది.

Also read : Bigg Boss Telugu 5 contestants full list: బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టంట్స్ పూర్తి జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News