Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

Bigg Boss Telugu Season 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో భాగంగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో పియాంకపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేయకపోతే తానే నేరుగా నామినేట్ అవుతుందని బిగ్ బాస్ హెచ్చరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 04:00 PM IST
    • ఆసక్తికరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్-5 కొత్త ప్రోమో
    • ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్
    • నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేయకుంటే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరిక
Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

Bigg Boss Telugu Season 5 Promo: కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-5’ తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 సభ్యులు ఉండగా.. కెప్టెన్ షణ్ముఖ్ సహా మిగిలిన ముగ్గురు నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌ ఫొటోలు ఉన్న బాల్స్‌ను కంటెస్టెంట్స్‌ అందరికీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఇంటి మెయిన్‌ గేట్లను తెరిచాడు.

ఇంటి సభ్యులు నామినేట్ చేయాల్సిన వారి బంతిని తీసుకొని.. దాన్ని ఇంటి బయటకు కాలుతో కిక్ చేయాల్సి ఉంటుంది. ఇంటి చివరి కెప్టెన్ అయిన షణ్ముఖ్ నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగా.. కాజల్‌కు ఇంట్లో కొనసాగే అర్హత లేదని చెప్పి.. ఆమె ఫొటోతో ఉన్న బంతిని గేట్‌ అవతలికి తన్నాడు.

ఆ తర్వాత సన్నీ.. శ్రీరామ్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. వీరిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఇక, ప్రియాంక ఎప్పటిలాగే.. ఇంటిసభ్యుల్ని నామినేట్‌ చేయడానికి తన దగ్గర బలమైన కారణం ఏమీ లేదని చెప్పి.. "బిగ్‌బాస్‌ నాకు కాస్త సమయం కావాలి" అని అడిగింది. వెంటనే కెప్టెన్‌ షణ్ముఖ్‌ స్పందిస్తూ.. "చెప్పాలి పింకీ తప్పదు. ఇప్పటికైనా చెప్పాలి కదా. కారణాలు లేవు.. నేను ఇప్పుడే చెప్పలేను అంటే కుదరదు కదా" అని అనగా.."నేను హర్ట్‌ అయ్యింది నీ వల్లే. చెప్పాలనుకుంటే నీ పేరే చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు" అని సమాధానమిచ్చింది.

మధ్యలో సన్నీ అందుకుని కాజల్‌, మానస్‌లను నామినేట్‌ చేయాలని సిల్లీ రిజన్స్‌ చెప్పాడు. వెంటనే షణ్ముఖ్‌ కలగజేసుకొని.. "నామినేషన్‌ అనేది చాలా సీరియస్‌ విషయం. ఇక్కడ కామెడీ చేయకండి" అని చెప్పాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ప్రియాంక.. బిగ్‌బాస్‌ మిమ్మల్ని చివరిసారి హెచ్చరిస్తున్నాడు. మీరు కనుక ఇప్పుడు ఎవర్నీ నామినేట్‌ చేయకపోతే.. మీరే నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తారు" అంటూ హెచ్చరించాడు. 

యాంకర్ రవి ఎలిమినేట్

గత వారానికి సంబంధించి ఎవరూ ఊహించని రీతిలో ఎలిమినేషన్‌ జరిగింది. యాంకర్‌ రవి.. ఆదివారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. గత వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయిన వాళ్లలో చివరకు కాజల్‌, రవి లు మిగిలారు. ఈ ఇద్దరిలో ఒకరిని కాపాడే అవకాశం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్న సన్నీకి రావడం వల్ల అతడు కాజల్‌ను సేవ్‌ చేశాడు. మరోవైపు కాజల్‌తో పోలిస్తే రవికే తక్కువ ఓట్లు వచ్చాయని అందుకే హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌-5లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన 19 మంది పోటీదారుల్లో రవి బలమైన కంటెస్టెంట్‌. బుల్లితెర యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి షోలోనూ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసేవారు. అంతేకాదు, అడపాదడపా కొన్ని సినిమాల్లో కథానాయకుడి స్నేహితుడిగా కనిపించి అలరించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌ వరకూ ఉంటారని అనుకున్న ఐదుగురు కంటెస్టెంట్‌లలో రవి పేరు బాగా వినిపించింది. అయితే, పరిస్థితులు తారుమారు కావడం వల్ల 12వ వారమే ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది!  

Also Read: Dhanush: హీరో ధనుష్‌కు బ్రిక్స్ అవార్డు...'అసురన్'లో నటనకు గానూ...

Also Read: Pushpa Movie Release Date: అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News