Bigg Boss Nonstop: బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

Bigg Boss Nonstop: బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు నిర్వాహకులు. తాజాగా ప్రోమో కూడా రిలీజ్ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 07:34 PM IST
  • బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్
  • ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ రిలీజ్
  • డిజిటల్ వెర్షన్ ప్రోమో విడుదల చేసిన నిర్వాహకులు
Bigg Boss Nonstop: బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

Bigg Boss Telugu Ott Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా ముగించుకున్న ఈ షో...ఇప్పుడు ఆరు సీజన్ కోసం రెడీ అయింది. అయితే ఈ సారి ఈ షో సరికొత్తగా డిజిటల్ వెర్షన్ లో రాబోతుంది. బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జునే (Nagarjuna Akkineni) హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. 

తాజాగా బిగ్ బాస్ డిజిటల్ వర్షన్ స్ట్రీమింగ్ ప్రోమో (Bigg Boss Telugu Ott Promo) విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో నాగార్జునతో పాటు వెన్నెల కిషోర్, మురళీ శర్మ సందడి చేశారు. ఇప్పటివరకు టెలివిజన్ లో బిగ్ బాస్ షో రోజుకు ఓ గంట మాత్రమే చూసే అవకాశం ఉండేది. వీకెండ్స్ లో అయితే రెండు నుండి మూడు గంటలు కొనసాగేది. కానీ డిజిటల్ బిగ్ బాస్ స్ట్రీమింగ్ (Bigg Boss digital Streaming) అలా కాదు. వారంలో 7 రోజులు, 24 గంటలపాటు ఏం జరుగుతుందో చూపిస్తారు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss nonstop) పేరుతో రిలీజైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కంటెస్టెంట్లు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాత సీజన్ల కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ విజయవంతమయ్యింది. గతేడాది డిసెంబరులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Season 5) విజేతగా వీజే సన్నీ, రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read: Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News