నాగార్జున: షణ్ముఖ్‌.. దీప్తిని మిస్ అయితే...ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు..!

Bigg Boss Telugu 5: గత వారం రోజులుగా బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున ఫైర్ అయ్యాడు. సిరి, షణ్మూలపై అసహనం వ్యక్తం చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 06:40 PM IST
నాగార్జున: షణ్ముఖ్‌.. దీప్తిని మిస్ అయితే...ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు..!

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌(Bigg boss) తెలుగు ఐదో సీజన్‌ రోజురోజూకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్లు ఎవరికీ వారు తమకు నచ్చిన వ్యక్తితో బాండింగ్ ఏర్పరుచుకున్నారు. సిరి, షణ్మూ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. వారిద్దరూ రోజురోజుకీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. తాజాగా ఇదే విషయంపై నాగార్జున(Nagarjuna) ఫైర్ అయినట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి క్లాస్ తీసుకున్నారు. 

నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? అని సిరి(siri)ని నిలదీశాడు నాగార్జున. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా? అని ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. దీనికి సిరి.. ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదని చెప్తూ ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదు అనుకోవద్దని చెప్తూ ఆమె పరువు తీశాడు. దీంతో ఓపెన్‌ అయిన సిరి.. షణ్నూతో ఎందుకు కనెక్షన్‌ వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది.

Also Read: 'బిగ్ బాస్ లో ఆ సీన్స్ జరిగాయి...సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి'..నటి షాకింగ్ కామెంట్స్

ఇదే ప్రశ్న షణ్నూ(Shanmukh)ని అడగ్గా అతడు మానసికంగా వీక్‌ అయ్యానన్నాడు. తన ప్రేయసి దీప్తి సునయనను మిస్‌ అవుతున్నానని చెప్పాడు. అంతలా మిస్‌ అయితే ఈ క్షణమే వెళ్లిపో అంటూ బిగ్‌బాస్‌ ఇంటి గేట్లు తెరిచాడు నాగ్‌. దీంతో షణ్మూ ఆశ్చర్యపోయాడు.  మరి షణ్ముఖ్ నిజంగా వెళ్లిపోయాడో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News