బిగ్‌బాస్‌: ప్రియాంక ఫ్రెండ్ మాత్రమే..సిరి సంబంధాలు చూస్తున్నాం..

 Bigg Boss Telugu 5: సండే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్‌ డే కూడా అంటున్నాడు హోస్ట్‌ నాగార్జున. తాజా ప్రోమో చూస్తుంటే..కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్‌ ఆడించినట్లు కనిపిస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 06:38 PM IST
బిగ్‌బాస్‌: ప్రియాంక ఫ్రెండ్ మాత్రమే..సిరి సంబంధాలు చూస్తున్నాం..

Bigg Boss Telugu 5 latest Promo: బిగ్ బాస్ లేటేస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. హౌస్ లో సండే సందడి షురూ అయ్యింది. తాజా ప్రోమో(Bigg Boss Telugu 5 Promo)లో 'అనుభవించు రాజా' టీమ్ సందడి చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు నాగ్‌(Nagarjuna).. కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్‌ ఆడించినట్లు కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఇతర ఇంటిసభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను పేపర్‌ మీద రాసివ్వగా నాగ్‌ వాటిని అడుగుతున్నట్లుగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

ఇందులో భాగంగా...ఫిజికల్‌ టాస్క్‌ అనగానే సన్నీ సైడ్‌ చూస్తావు, తను మరీ అంత వైల్డా? అని షణ్నును క్వశ్చన్‌ చేయగా అతడు ఫక్కుమని నవ్వేశాడు. ఇక మానస్‌(Manaas)ను.. ప్రియాంకతో నీ ఫ్యూచర్‌ రిలేషన్‌ ఏంటని ప్రశ్నించగా దానికతడు తడుముకోకుండా ఫ్రెండ్‌షిప్‌ అని బదులిచ్చాడు. మానస్‌ నుంచి ఏం ఆశిస్తున్నావని ప్రియాంకను అడగ్గా.. ముందు ఈ తిక్క ప్రశ్న ఎవరడిగారని ఆరా తీసింది. దీంతో నాగ్‌.. మానసే అడిగాడు అని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. 

Also Read: నాగార్జున: షణ్ముఖ్‌.. దీప్తిని మిస్ అయితే...ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు..!

యానీ మాస్టర్‌ను.. మీ బుర్రను వంంట చేసేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే వాడతారా? అని అడగడంతో ఆమె నోరెళ్లబెట్టింది. దీనికి యానీ.. అలా ఏం లేదని ఆన్సరిచ్చింది. నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్‌ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి.ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌తో రాజ్‌తరుణ్‌ మాట్లాడారు.  ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News