Anchor Suma: బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రచ్చ రంబోలా!

Anchor Suma as wild card entry into Bigg Boss Telugu 4 | మాటల పిడుగు, స్టార్ యాంకర్ సుమ కనకాల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికురాలు, యాంకర్ సుమ తన లగేజీతో సహా బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపై కనిపించడంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. హౌస్ సభ్యులలో మాత్రం టెన్షన్ మొదలైంది.

Last Updated : Nov 8, 2020, 04:56 PM IST
  • సూట్‌కేస్‌తో బిగ్ బాస్ తెలుగు 4 హౌస్‌కు వచ్చిన యాంకర్ సుమ
  • వైల్డ్ కార్డ్ ఎంట్రీ డ్రామా నడుపుతున్న తెలుగు బిగ్ బాస్ హోస్ట్
  • సుమను చూసి సంతోషపడుతూనే షాకవుతున్న కంటెస్టెంట్స్
Anchor Suma: బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రచ్చ రంబోలా!

అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లోకి మాటల పిడుగు, స్టార్ యాంకర్ సుమ కనకాల వైల్డ్ కార్డ్ ఎంట్రీ (Anchor Suma Kanakala as wild card entry) ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికురాలు, యాంకర్ సుమ (Anchor Suma) తన లగేజీతో సహా బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపై కనిపించడంతో ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడుతూ బిగ్ బాస్ 4 హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా యాంకర్ సుమను చూడగానే షాకయ్యారు. వారు ఎన్నో కష్టాలు పడి 9 వారాలుగా బిగ్ బాస్ 4 హౌస్‌లో ఉంటున్నారు. పైగా నేడు ఒకరి ఎలిమినేషన్ కూడా ఉంది.  బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు అని తరచుగా బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం పదే పదే చెబుతుంటారు. 

 

స్టార్ మా తాజాగా వదిలిన యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు ఫన్ ఇప్పుడు రెట్టింపు కాబోతుందని పేర్కొంటూ స్టార్ మా ట్విట్టర్‌లో సుమ బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతున్న ప్రోమో పోస్ట్ చేసింది. హౌస్‌మేట్స్ సుమను చూడగానే సంతోషంతో పాటు షాకయ్యారు. నిజంగానే మీరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నారా అని అడగటం వీడియోలో కనిపిస్తుంది. కరోనా ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, అందుకే తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒప్పుకున్నానంటూ హోస్ట్ నాగార్జునకు బదులిచ్చారు యాంకర్ సుమ కనకాల.

మరోవైపు ఆలోచిస్తే దీపావళి పండుగ సందర్భంగా సుమ బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌కు ఫెస్టివల్ గిఫ్ట్స్ తీసుకువచ్చారని సైతం నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుమ నిజంగానే రంగంలోకి దిగారంటే వార్ వన్ సైడ్ అయిపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రావడంతోనే నేను రావడం మెహబూబ్‌కు ఇష్టం లేదనుకుంటా.. అందుకే ముఖం అదోలా పెట్టాడంటూ గేమ్ స్టార్ట్ చేశారు సుమ. నేను ఇంకా షాక్‌లో ఉండిపోయానని కంటెస్టెంట్ ‘దిల్ సే’ మెహబూబ్ బదులిస్తాడు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News