Shiva Jyothi Birthday : 30 ఏళ్లు వచ్చాయట!.. పొట్టి బట్టల్లో శివ జ్యోతి బర్త్ డే సెలెబ్రేషన్స్

Shiva Jyothi Birthday బిగ్ బాస్ షోతో శివ జ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫేమస్ అయింది. అంతకు ముందు తీన్మార్ వార్తలతో క్రేజ్ దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వచ్చాక తన కెరీర్ మారిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 06:32 PM IST
  • నెట్టింట్లో బిగ్ బాస్ సెలెబ్రిటీల సందడి
  • బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకున్న శివ జ్యోతి
  • శివ జ్యోతిని నిలదీసిన నెటిజన్
Shiva Jyothi Birthday : 30 ఏళ్లు వచ్చాయట!.. పొట్టి బట్టల్లో శివ జ్యోతి బర్త్ డే సెలెబ్రేషన్స్

Bigg Boss Shiva Jyothi 30th Birthday బిగ్ బాస్ మూడో సీజన్లో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లు ఫేమస్ అయ్యారు. అషూ, శివ జ్యోతి, హిమజ, రోహిణి ఇలా చాలా మంది క్రేజ్ దక్కించుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లో వీరు చేసిన సందడి కంటే.. బయటకు వచ్చాక చేసిన రచ్చే ఎక్కువగా ఉంటుంది. శివ జ్యోతి అయితే బిగ్ బాస్ షో అంటేనే భయపడేలా చేసింది. ఆమె ఏడుపులుపెడబొబ్బులు చూసి అంతా నోరెళ్లబెట్టేసేలా చేసింది. ఎవరైనా ఎలిమినేట్ అయితే.. చావులకు ఎలా ఏడుస్తారో అలా ఏడ్చేసేది.

శివ జ్యోతి కాదు.. పాతాళగంగా అంటూ అందరూ ట్రోల్స్ చేసి మీమ్స్‌తో ఆడుకున్నారు. అలా శివ జ్యోతి తన సావిత్రి ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంది. తీన్మార్ వార్తలతో సావిత్రిగా ఫేమస్ అయిన శివ జ్యోతి.. చివరకు బిగ్ బాస్ షోతో జ్యోతక్కగా మారిపోయింది. తాను అనుకున్నది అలా సాధించేసింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో శివ జ్యోతికి రవికృష్ణ, అలి రెజా ఇలా చాలా మంది ఆత్మీయులుగా మారిపోయారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

రవి కృష్ణను అయితే ఇంట్లోని వ్యక్తిలానే చూసుకుంటుంది. కరోనా అంటే అంతా భయపడే టైంలోనూ రవికృష్ణను జాగ్రత్తగా చూసుకుంది. ఇక శివ జ్యోతి ఇప్పుడు తన భర్త గంగులుని కూడా బాగానే ఫేమస్ అయ్యేలా చేసింది. బుల్లితెరపై జరిగే రియాల్టీ షోలకు తన భర్తను కూడా తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేసేస్తున్నారు.

మొన్నటి వరకు కాశ్మీర్ ట్రిప్‌ను కూడా ఈ జోడి బాగానే రచ్చ చేసింది. కాశ్మీరు లోయలో, మంచు కొండల్లో ఈ ఇద్దరూ చేసిన రీల్స్, పెట్టిన పోజులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు శివ జ్యోతి తన ముప్పవ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. పొట్టి బట్టల్లో తన బర్త్ డేను జరుపుకుంది. ముప్పై ఏళ్లు వచ్చాయని చెబుతూ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

బ్లూ టిక్ ఉన్న వాళ్లు కామెంట్ చేస్తేనే రిప్లై ఇస్తావా? మాకు రిప్లై ఇవ్వవా? అని ఓ అభిమాని నిలదీశాడు. దీంతో శివ జ్యోతి స్పందించింది. అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.. ఇవ్వలేకపోయినా కనీసం లైక్ అయినా కొడుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News