Bigg Boss Mehaboob Car : లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ మెహబూబ్.. రంజాన్ స్పెషల్ అంటూ పోస్ట్

Bigg Boss Mehaboob Buys Car బిగ్ బాస్ షోతో ఫేమస్ అయ్యాడు మెహబూబ్. అంతకు ముందు యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. తన డ్యాన్సులతో మెహబూబ్ బాగానే ఫేమస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మెహబూబ్‌ క్రేజ్ తెచ్చుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 05:02 PM IST
  • నెట్టింట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సందడి
  • కొత్త కారు కొన్న మెహబూబ్ దిల్ సే
  • బిగ్ బాస్ మెంటర్ల రియాక్షన్ ఇదే
Bigg Boss Mehaboob Car : లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ మెహబూబ్.. రంజాన్ స్పెషల్ అంటూ పోస్ట్

Bigg Boss Mehaboob Buys Car సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో మెహబూబ్‌ ఒకరు. యూట్యూబర్ గా ఇతడికి దక్కిన గుర్తింపు కొంత వరకు అయితే బిగ్ బాస్ తో తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు అయ్యాడు. బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇవ్వడంతో మెహబూబ్‌ స్థాయి అమాంతం పెరిగింది. బిగ్‌ బాస్ లో సోహెల్‌ తో స్నేహం ఇతడికి మరింతగా కలిసి వచ్చింది. చూడ్డానికి సాదా సీదాగా అనిపించినా కూడా అతడి ఫిజిక్‌ చూస్తే ఎంతటి వారైనా నోరు వెళ్లబెట్టాల్సిందే.

హీరో స్థాయి కండలు పెంచుతూ నెటిజన్స్ ను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తూ ఉండే మెహబూబ్‌ బిగ్ బాస్ తర్వాత బాగానే సంపాదిస్తున్నట్లుగా ఆయన జోరు చూస్తూ ఉంటే అనిపిస్తుంది. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఇన్ స్టా గ్రామ్‌ లో భారీ ఎత్తున ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో పాటు యూట్యూబర్‌ గా మరింత బిజీ అయ్యాడు. కవర్‌ సాంగ్స్ చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ లు చేయడం ద్వారా మరింతగా మెహబూబ్‌ ఫేమస్ అయ్యాడు. 

కండల వీరుడు అంటూ పేరు దక్కించుకున్న మెహబూబ్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ ద్వారానే కాకుండా పలు మార్గాల ద్వారా సంపాదిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే తాజాగా రంజాన్‌ సందర్భంగా ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. బుల్లి తెర.. సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిన మెహబూబ్‌ ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ లో సంపాదించడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

 

రంజాన్ సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లుగా స్వయంగా మెహబూబ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. యూట్యూబ్‌ తో పాటు ఇన్ స్టా గ్రామ్‌ లో అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్‌ చేసుకున్నాడు. బిగ్‌ బాస్ లో ఫైనల్‌ వరకు లేకపోయినా కూడా చిరంజీవి తో ప్రశంసలు దక్కించుకున్న మెహబూబ్.. ఏకంగా చిరు భార్య సురేఖ గారు వండిన బిర్యానీని తినే అవకాశంను దక్కించుకున్నాడు.

Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

ఇన్ స్టా గ్రామ్‌.. యూట్యూబ్‌ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని బిగ్‌ బాస్‌ కి వెళ్లిన వారికి పెద్దగా గుర్తింపు.. ఆదాయం రాలేదు. కానీ మెహబూబ్ మాత్రం తన కెరీర్‌ ను పక్కా గా ప్లాన్ చేసుకోవడంతో ఈ స్థాయిలో ఉన్నాడని కొందరు అంటూ ఉంటారు. ఇప్పుడు మెహబూబ్ కొత్త కారు మీద సోహెల్, సావిత్రి, శ్రీరామచంద్ర వంటి వారు స్పందించారు. ప్రణవి మానుకొండ, సోనియా సింగ్, బిగ్ బాస్ మేనేజ్మెంట్ మెంబర్ రాజేశ్వరి కూడా స్పందించి.. కంగ్రాట్స్ చెప్పారు.

Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News